అంతా సంగక్కర వల్లే!: భారత్‌పై విజయానికి కారణం చెప్పిన లంక కెప్టెన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడానికి తమ మాజీ కెప్టెన్ కుమార సంగక్కర చేసిన సూచనలేనని కారణమని ఆ జట్టు కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్‌ చెప్పాడు. ది ఓవల్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు 

భారత్‌పై అన్ని రంగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక, సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాథ్యూస్ మీడియాతో మాట్లాడాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగామని, ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు.

ICC Champions trophy: Angelo Mathews says Sri Lanka can beat any team

మ్యాచ్‌కు రెండు రోజుల ముందు సంగక్కర యువ ఆటగాళ్లకు బ్యాటింగ్‌లో మెళుకవలు సూచించాడని, వాటిని యువ ఆటగాళ్లు అమలుపరిచారని అదే గెలుపుకు కారణమైందని మాథ్యూస్‌ అన్నాడు. కుసాల్‌ మెండీస్‌(89) రాణించడానికి సంగక్కర బ్యాటింగ్‌ సూచనలే కారణమని చెప్పాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమితో ఒత్తిడిలో ఉన్నతాము భారత్‌తో మ్యాచ్‌ గెలుస్తామనుకోలేదని అన్నాడు. కానీ సాయశక్తుల పోరాడాలని, స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు మాథ్యూస్‌ తెలిపాడు. స్వేచ్ఛగా దూకుడుగా ఆడామని అదే భారత్‌పై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిందని మాథ్యూస్ చెప్పాడు.

గత కొద్దీ కాలంగా విజయాలు లేని మాకు ఈ విజయం ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నాడు. తొడ నరాలు పట్టుకొని బాధపడుతున్న కుసాల్‌ పెరారా(47)ను కెప్టెన్‌గా రిటైర్డ్‌ హాట్‌గా పంపిచానని, ఆసమయంలో ఫలితం గురించి ఆలోచించలేదని తెలిపాడు.

ఫలితం వేరేలా ఉంటే నాపై విమర్శలు వస్తాయని తెలుసని, కానీ కఠిన పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని మాథ్యూస్‌ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికిన సంగక్కర ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీల్లో సర్రేకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇంగ్లాండ్‌లోనే ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతుండటంతో అక్కడ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న కుమార సంగక్కర.. తన స్వదేశానికి చెందిన జట్టుకు సలహాలు, సూచనలు అందించాడు. సంగక్కర చేసిన సూచనలు, సలహాలను మ్యాచ్‌లో అమలు చేశామని మాథ్యూస్‌ చెప్పుకొచ్చాడు.

తాజా విజయంతో సెమీస్‌ రేసులో ఉన్నామని, సోమవారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఇదే ప్రణాళిక అమలు చేస్తామని కెప్టెన్ మాథ్యూస్ పేర్కొన్నాడు. గెలుపుపై ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతామని మాథ్యూస్‌ పేర్కొన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After a dramatic victory over India, Sri Lanka's captain Mathews stated that Sri Lanka are capable of beating any team. Riding on half-centuries from Danushka Gunathilaka (76 off 72) and Kusal Mendis (89 off 93), Sri Lanka defeated defending champions India in Match 8 of the ICC Champions Trophy at the Oval, London.
Please Wait while comments are loading...