ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌దే: భారత్ Vs పాక్ మ్యాచ్ హైలెట్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చరిత్ర సృష్టించింది. ఏకపక్షంగా సాగిన పోరులో పాక్‌దే పైచేయి అయింది. పాకిస్తాన్ విసిరిన 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు 158 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో భారత్‌పై 180 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు 

భారత బ్యాట్స్‌మెన్‌లలో శిఖర్ ధావన్ (21), యువరాజ్ సింగ్ (22), హార్ధిక్ పాండ్యా (76), రవీంద్ర జడేజా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్, హసన్ అలీ చెరో మూడు వికెట్లు తీయగా షాదాబ్ ఖాన్ రెండు, జునైద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

Centurion Fakhar Zaman shines

అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ చెల‌రేగారు. భారత్ బౌలర్లు పూర్తిగా విఫలమైన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు ఫ‌క‌ార్ జ‌మాన్ (114) సెంచ‌రీతో చెలరేగగా, అజ‌ర్ అలీ (59)లు చక్కటి శుభారంభాన్ని అందించారు.

ఆ తర్వాత మహ్మ‌ద్ హ‌ఫీజ్ (37 బాల్స్‌లో 57 నాటౌట్‌) అర్ధ సెంచ‌రీ చేయడంతో పాకిస్థాన్ భారీ స్కోరు నమోదు చేసింది. బాబర్ అజామ్ 46 పరుగుల వద్ద అవుటై తృటిలో సెంచరీని కోల్పోయాడు. భార‌త్ త‌ర‌ఫున పేసర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఒక్క‌డే కాస్తంత ఫరవాలేదనిపించాడు. స్పిన్న‌ర్లు అశ్విన్‌, జ‌డేజా తేలిపోయారు.

అశ్విన్ 10 ఓవ‌ర్ల‌లో ఒక్క వికెట్ తీయకుండా 70 పరుగులు ఇవ్వగా, ఆల్ రౌండర్ జ‌డేజా 8 ఓవ‌ర్ల‌లో 67 ప‌రుగులు సమర్పించుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండ‌టంతోపాటు భార‌త బౌల‌ర్లు ఎక్స్‌ట్రాలు ఎక్కువ ఇవ్వ‌డం కూడా పాకిస్థాన్ భారీ స్కోరు చేసింది. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 నోబాల్స్‌, 5 వైడ్లు వేశాడు. భువీ, పాండ్యా, జాదవ్ తలో వికెట్ తీశారు.

Centurion Fakhar Zaman shines

భారత్ Vs పాక్ మ్యాచ్ హైలెట్స్:

* ది ఓవల్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన ఓ జట్టు నమోదు చేసిన అత్యధిక స్కోరు 338/4. ఆదివారం జరిగిన పైనల్లో భారత్‌పై పాక్ నమోదు చేసింది.
* ఐసీసీ వన్డే ఫైనల్‌ ఆడిన అతి పిన్న వయస్కుడిగా పాకిస్థాన్‌కు చెందిన షాదబ్ ఖాన్ (18 సంవత్సరాల 257 రోజులు) అరుదైన ఘనత సాధించాడు. అంతకముందు ఈ రికార్డు యువరాజ్ సింగ్ (18 సంవత్సరాల 308 రోజులు) పేరిట ఉంది.
* 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫకార్ జమాన్ బుమ్రా బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చాడు. అయితే దీనిని నో బాల్ అంఫైర్ ప్రకటించడంతో బతికిపోయాడు.
* వన్డేల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి బుమ్రా 11 నో బాల్స్ వేశాడు. ఇటీవల కాలంలో ఏ బౌలర్ కూడా ఇలా వేయలేదు.
* ఛాంపియన్స్ ట్రోఫీలో భువనేశ్వర్ కుమార్ 4వ సారి మెయిడిన్ ఓవర్ వేశాడు.
* ఐసీసీ వన్డే టోర్నీల్లో భారత్‌పై అజర్ అలీ, ఫకార్ జమాన్‌లు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* 60 బంతుల్లో అజర్ అలీ అర్ధ సెంచరీ చేయగా, 61 బంతుల్లో ఫకార్ జమాన్ అర్ధ సెంచరీ చేశాడు.
* వన్డేల్లో అజర్ అలీ 12వ అర్ధసెంచరీని నమోదు చేయగా, ఫకార్ జమీన్ వరుసగా మూడో అర్ధసెంచరీని నమోదు చేశాడు.

Centurion Fakhar Zaman shines

* జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అజర్ అలీ 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు.
* జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో లైఫ్ వచ్చిన తర్వాత ఫకార్ జమాన్ చెలరేగి ఆడాడు. 96 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
* ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ తరుపున ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించారు. సయిద్ అన్వర్, షోయబ్ మాలిక్ జాబితాలో తాజాగా ఫకార్ జమాన్ చేరాడు.
* 114 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో ఫకార్ జమాన్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
* 106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 114 పరుగులు చేసిన ఫకార్ పాండ్యా బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
* 16 బంతుల్లో 12 పరుగులు చేసిన షోయబ్ మాలిక్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కేదార్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
* మాలిక్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హఫీజ్ 37 బంతుల్లో 57 పరుగులు చేశాడు.
* భార‌త్ త‌ర‌ఫున పేసర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఒక్క‌డే కాస్తంత ఫరవాలేదనిపించాడు. 10 ఓవర్లు వేసి 44 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
* స్పిన్న‌ర్లు అశ్విన్‌, జ‌డేజా తేలిపోయారు. అశ్విన్ 10 ఓవ‌ర్ల‌లో ఒక్క వికెట్ తీయకుండా 70 పరుగులు ఇవ్వగా, ఆల్ రౌండర్ జ‌డేజా 8 ఓవ‌ర్ల‌లో 67 ప‌రుగులు సమర్పించుకున్నాడు.
* పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండ‌టంతోపాటు భార‌త బౌల‌ర్లు ఎక్స్‌ట్రాలు ఎక్కువ ఇవ్వ‌డం కూడా పాకిస్థాన్ భారీ స్కోరు చేసింది.
* భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 నోబాల్స్‌, 5 వైడ్లు వేశాడు. బుమ్రా 9 ఓవర్లు వేసి 68 పరుగులిచ్చాడు.
* భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా, కేదార్ జాదవ్ తలో వికెట్ తీశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Riding over brilliant century from Fakhar Zaman, Pakistan scored 338/4 against India in the final of the ICC Champions Trophy 2017 here on Sunday (June 18).
Please Wait while comments are loading...