భారత్ ఓటమిని భజ్జీ ముందే ఊహించాడా?: మ్యాచ్‌కి ముందే కోహ్లీసేనకు వార్నింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలి పరాభవం ఎదురైంది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు  | స్కోరు కార్డు

గురువారం ది ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా... శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 322 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఆసక్తికరంగా సెమీస్: వర్షంతో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు అయితే?

అనంతరం 322 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 48.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది. ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు లంకను తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీమిండియాను హెచ్చరించాడు.

ICC Champions Trophy: Harbhajan Singh Cautions India Ahead Of Clash With Sri Lanka

టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి పాలవ్వడంతో భారత్‌తో జరిగే మ్యాచ్ శ్రీలంకకు చావో రేవో లాంటిదనే విషయాన్ని కోహ్లీసేన గుర్తించుకోవాలని మ్యాచ్‌కి ముందు ఐసీసీకి రాసిన కాలమ్‌లో కోహ్లీసేనకు హర్భజన్ సింగ్ వార్నింగ్ మెసేజ్ పంపాడు.

లంక చేతిలో తొలి పరాభవం: ఓటమిపై కోహ్లీ ఏమన్నాడో తెలుసా?

ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై డక్ వర్త్ లాయిస్ పద్ధతి ప్రకారం 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 'పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రతి ఒక్కరూ పాజిటివ్ క్రికెట్ ఆడారు. బౌలర్లు కూడా అద్బుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ రాణించడం సంతోషం' అని భజ్జీ పేర్కొన్నాడు.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు సమిష్టిగా రాణించడం జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం అభినందనీయమని కోహ్లీసేనపై భజ్జీ ప్రశంసలు కొనియాడాడు. అయితే 50 ఓవర్ల మ్యాచ్ కాడవంతో భారత్‌పై శ్రీలంక గెలిచే అవకాశాలను కొట్టిపారేయలేమని భజ్జీ వ్యాఖ్యానించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India kicked off their ICC Champions Trophy 2017 campaign on a high, pummeling Pakistan by a huge 124 runs at Edgbaston. Now, an upbeat Virat Kohli-led India will take on Sri Lanka in their second match on Thursday and a win will assure them of a place in the semi-finals.
Please Wait while comments are loading...