భారత్-ఇంగ్లాండ్ పైనల్?: కోహ్లీ ఏం చెప్పాడో తెలుసా? (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో లీగ్ దశను విజయవంతంగా పూర్తి చేసుకుని సెమీస్‌కు చేరిన భారత జట్టు ఆటగాళ్లు లండన్‌లో షికార్లు చేస్తున్నారు. జూన్ 15వ తేదిన ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగే సెమీ పైనల్ మ్యాచ్‌లో టీమిండియా, బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించిన టీమిండియా

లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించిన టీమిండియా

అయితే ఈ మ్యాచ్‌కి కాస్తంత విరామం లభించడంతో టీమిండియా ఆటగాళ్లు సోమవారం లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హైకమిషన్‌ కార్యాలయ సిబ్బంది అడిగిన ప్రశ్నలకు పలువురు భారత ఆటగాళ్లు సమాధానాలిచ్చారు.

ప్రత్యర్థి ఎవరైనా సరే సిద్ధంగా ఉన్నామంటూ కోహ్లీ సమాధానం

ప్రత్యర్థి ఎవరైనా సరే సిద్ధంగా ఉన్నామంటూ కోహ్లీ సమాధానం

టీమిండియా సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధిస్తే పైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడాల్సి వస్తోందేమోనని అని అడగ్గా... ప్రత్యర్థి ఎవరైనా సరే తాము సిద్ధంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సమాధానమిచ్చాడు. ఈ కార్యక్రమానికి మాజీ కెప్టెన్ ధోని, యువరాజ్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌, మహమ్మద్‌ షమి, కోచ్‌ అనిల్‌కుంబ్లే తదితరులు పాల్గొన్నారు.

లార్డ్స్‌లోని హిస్టారిక్‌ లాంగ్‌ రూమ్‌లో టీమిండియా

అంతకముందు లార్డ్స్‌లోని హిస్టారిక్‌ లాంగ్‌ రూమ్‌లో భారత హైకమిషన్‌ సిబ్బంది టీమిండియా ఆటగాళ్లకు ఘనస్వాగతం పలికారు. క్రికెట్‌కు సంబంధించిన పుస్తకాలు, అలనాటి క్రీడాకారుల జ్ఞాపకాలను చూస్తూ ఆటగాళ్లు సరదాగా గడిపారు. అనంతరం కార్యాలయ సిబ్బంది అడిగిన పలు ప్రశ్నలకు ఆటగాళ్లు సమాధానమిచ్చారు.

రెండో సెమీ ఫైనల్లో బంగ్లాతో టీమిండియా

రెండో సెమీ ఫైనల్లో బంగ్లాతో టీమిండియా

ఇదిలా ఉంటే టోర్నీలో సెమీస్‌కు చేరాలంటో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి టీమిండియా సెమీస్‌కు చేరింది. జూన్ 15 (గురువారం) జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్‌-ఎలో ఉన్న బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా ఫైనల్‌కి చేరుకుంది. మరోవైపు తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు పాక్‌తో తలపడనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The great and the good of cricket came together in the historic Long Room of Lord’s on Monday, with some hoping for an India-England final in the ongoing ICC Champions Trophy, but captain Virat Kohli said the team is ready for any rival.
Please Wait while comments are loading...