పాక్ క్రికెటర్‌ను గాడిదతో పోల్చి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తివారీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ ర‌షీద్ ల‌తీఫ్‌కు టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి భారత్‌పై నోరు పారేసుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 4వ తేదీన భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు 

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. బాప్ బాప్ హోతా హై అంటూ పాకిస్థాన్‌పై విజయం సాధించిన తర్వాత టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వివాదానికి కార‌ణ‌మైంది. సెహ్వాగ్‌తో పాటు భారత జట్టు, భారత ఆటగాళ్లపై ల‌తీఫ్ నోరు పారేసుకున్న విష‌యం తెలిసిందే.

తీవ్ర ప‌ద‌జాలంతో సెహ్వాగ్‌ను విమ‌ర్శించాడు. పాక్‌పై భారత విజయాన్ని క్రీడాస్ఫూర్తితో తీసుకోవాల్సిన ల‌తీఫ్ నోరు జారాడు. భారత క్రికెట్‌లో ఎంతో మంది మంచి ప్లేయ‌ర్స్ ఉన్నారంటూనే.. వ్య‌క్తిగ‌తంగా సెహ్వాగ్‌ను బెదిరించే స్థాయికి దిగ‌జారాడు. ఇండియాలో త‌మ డాన్‌లు చాలా మందే ఉన్నార‌ని, త‌న‌ను కూడా డాన్‌గా మార్చొద్ద‌ని 15 నిమిషాల వీడియోను అత‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

ఈ క్రమంలో లతీఫ్ వీడియోపై టీమిండియా క్రికెటర్ మ‌నోజ్ తివారీ కూడా తీవ్రంగా స్పందించాడు. ల‌తీఫ్‌కు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ వీడియో సందేశాన్ని పంపాడు. మ‌రొక‌సారి ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే మొత్తం ఇండియ‌న్స్ చెప్పుల‌తో కొడ‌తార‌ని, ఖ‌బ‌డ్దార్ అంటూ హెచ్చ‌రించాడు.

సెహ్వాగ్‌ను తిట్టే ముందు నీ రికార్డులేంటో చూసుకో? అని తివారీ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు 48 ఏళ్ల లతీఫ్‌ను గాడిద అంటూ సంభోదించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian batsman Manoj Tiwary who has played 12 ODIs for the national team has now recorded a video where he has slammed the 48-year old calling Latif a donkey. It happened that former Pakistani wicketkeeper-batsman Latif recorded a video a few days ago. In that video, he bashed India and former Indian opener Virender Sehwag.
Please Wait while comments are loading...