బంగ్లా సంచలన విజయం: టోర్నీ నుంచి న్యూజిలాండ్ అవుట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బంగ్లాదేశ్‌ అద్భుత ప్రదర్శన చేసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఆ జట్టు చివరి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇక ఈ ఓటమితో కివీస్‌ ఇంటిముఖం పట్టింది.

న్యూజిలాండ్ నిర్దేశించిన 266 పరుగుల విజయ లక్ష్యాన్ని 47.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లా బ్యాట్స్ మెన్లు షకిబ్‌, మహ్మదుల్లా అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. 266 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో ఆ జట్టు 150 పరుగులు చేస్తే గొప్పేమో అనే అనుకున్నారంతా.

ఈ సమయంలో షకీబ్‌ అల్‌ హసన్‌ (115 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్‌), మహ్ముదుల్లా (107 బంతుల్లో 102 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఆటతీరుతో బంగ్లాను సంచలన విజయం వైపు నడిపించారు. ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా వీరిద్దరి అద్భుత ఆటతీరుని ప్రదర్శించారు.

ఈ క్రమంలో వీరిద్దరూ సెంచరీలతో చెలరేగడంతో కొండంత లక్ష్యాన్ని కూడా ఊదేశారు. 34.5 ఓవర్లు క్రీజులో నిలిచిన వీరిద్దరూ తమ ఆటతో బంగ్లాను వన్డే చరిత్రలోనే ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల (224) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షకిబ్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు.

Unchanged New Zealand elect to bat against Bangladesh

కివీస్‌ ఒక్క మ్యాచూ గెలవకుండానే న్యూజిలాండ్‌ (2 విజయాలు, ఒక మ్యాచ్‌ రద్దు) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో పాయింట్ల సంఖ్యను 3కు పెంచుకున్న బంగ్లా (1 విజయం, 1 ఓటమి, 1 రద్దు) సెమీస్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. కాగా, శనివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆస్టేలియా ఓడినా, మ్యాచ్‌ రద్దయినా బంగ్లా సెమీస్‌ చేరుతుంది.

బంగ్లా లక్ష్యం 266

అంతకముందు టోర్నీ సెమీస్‌ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆద్యంతం తడబాటునే కొనసాగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు 266 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

 Unchanged New Zealand elect to bat against Bangladesh

న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్(57; 69 బంతుల్లో 5 ఫోర్లు), రాస్ టేలర్(63;82 బంతుల్లో 6 ఫోర్లు) మినహా పెద్దగా ఎవరూ రాణించకపోవడంతో సాధారణ స్కోరుకే పరిమితం కావాల్సివచ్చింది. కార్డిఫ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, ల్యూక్ రోంచీలు దాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు.

ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో జట్టు స్కోరు 46 వద్ద ఓపెనర్‌ ల్యూక్‌ రాంకీ (16; 18 బంతుల్లో 2 ఫోర్లు) తస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత 23 పరుగులకే మరో ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (33; 35 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సు) పెవిలియన్‌కు చేరాడు. దీంతో కివీస్ 69 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

ఈ క్రమంలో కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ అర్ధ సెంచరీలతో జట్టును ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ముందుగా విలియమ్సన్ అర్ధ సెంచరీ సాధించగా, ఆపై టేలర్ కూడా అర్థ శతకం సాధించాడు. జట్టు స్కోరు 152 పరుగుల వద్ద విలియమ్సన్ మూడో వికెట్ అవుటవ్వగా, 201 పరుగుల వద్ద టేలర్ పెవిలియన్ బాటపట్టాడు.

 Unchanged New Zealand elect to bat against Bangladesh

మూడో వికెట్‌కు 83 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ నిష్ర్రమించిన తర్వాత న్యూజిలాండ్ స్కోరు నెమ్మదించింది. ఆ తర్వాత నీల్‌ బ్రూమ్‌ (36), జేమ్స్‌ నీషమ్‌ (23) పరుగులతో ఫర్వాలేదనిపించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్ స్పిన్నర్ మొసాదక్ హుస్సేన్ మూడు వికెట్లు సాధించగా, తస్కీన్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. కార్డిఫ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్‌ ఎంచుకొన్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే న్యూజిలాండ్ సెమీస్ రేసులో నిలుస్తుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు | స్కోరు కార్డు

ఓటమి పాలైతే న్యూజిలాండ్ ఇంటిదారి పట్టక తప్పదు. న్యూజిలాండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి వర్షం కారణంగా రద్దు అయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వరుణుడు అడ్డంకిగా మారడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో పాయింట్ల పట్టికలో ఒక పాయింట్‌తో చివరి స్థానంలో ఉంది.

 ICC Champions Trophy: Match 9: Unchanged New Zealand elect to bat against Bangladesh

ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే టోర్నీలో ఇంగ్లాండ్‌తో తలపడిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన మరో మ్యాచ్‌లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో ఒక పాయింట్‌తో మూడో స్ధానంలో ఉంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన వారు 3 పాయింట్లతో రెండో స్థానంలో నిలుస్తారు. జూన్ 11 (సోమవారం) ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ సెమీస్‌కు వెళ్లే జట్టును నిర్ణయిస్తుంది. ఇప్పటికే గ్రూప్-ఎలో ఇంగ్లాండ్ జట్టు సెమీస్‌కు చేరగా, రెండో బెర్తు కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

ఇదిలా ఉంటే భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌ 3 గంటలకే మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిసిపోయి ఉండటంతో మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమవుతోంది.

జట్ల వివరాలు:
న్యూజిలాండ్:కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, ల్యూక్ రోంచీ, రాస్ టేలర్, బ్రూమ్, నీషమ్, కోరీ అండర్సన్, సాంత్నార్, మిల్నే, సౌథీ, ట్రెంట్ బౌల్ట్

బంగ్లాదేశ్: మష్రఫ్ మోర్తాజ(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, తస్కిన్ అహ్మద్, ముష్పికర్ రహీమ్, షకిబుల్ హసన్, షబ్బిర్ రెహ్మాన్, మొహ్ముదుల్లా, మొసడెక్ హుస్సేన్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New Zealand skipper Kane Williamson won the toss and elected to bat against Bangladesh in their final Group A clash of the ICC Champions Trophy here on Friday (June 9).
Please Wait while comments are loading...