‘ఫ్యామిలీ టైమ్‌’: భార్య సాక్షి, కుమార్తె జీవాతో ధోని (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యనటలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో క్రికెటర్లు ఏ మాత్రం ఖాళీ దొరికినా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. లంకతో ఓటమి తర్వాత దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు దొరికిన విరామంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని తన భార్య సాక్షి, కుమార్తె జివాతో కలిసి ఎంజాయ్‌ చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు

దీనికి సంబంధించిన ఫోటోలను ధోని తన భార్య సాక్షి 'ఫ్యామిలీ టైమ్‌' అంటూ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. టోర్నీలో భాగంగా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 124 పరుగుల తేడాతో గెలిచిన కోహ్లీసేన ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్లతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

ICC Champions trophy: MS Dhoni enjoys a good time with family

ఈ మ్యాచ్‌లో ధోని 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో ధోనికి ఇది 62వ అర్ధ సెంచరీ. ఈ మ్యాచ్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన ధోని విదేశీ గడ్డపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్ మెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు మాజీ కెప్టెన్ గంగూలీ పేరిట ఉండేది.

కాగా, 49.2వ ఓవర్లో చండీమాల్‌ బౌలింగ్‌లో ధోనీ అవుటైన సంగతి తెలిసిందే. 296 మ్యాచ్‌లాడిన గంగూలీ 159 సిక్సర్లు బాదగా, 281 మ్యాచ్‌ల్లోనే ధోని 161 సిక్స్‌లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ అఫ్రిది 402 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుంది.

Family time !

A post shared by Sakshi (@sakshisingh_r) on Jun 9, 2017 at 9:11am PDT

A post shared by Sakshi (@sakshisingh_r) on Jun 8, 2017 at 10:25pm PDT

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MS Dhoni enjoyed a relaxing outing with his wife and daughter ahead of crucial Champions Trophy game against South Africa. The former Indian captain's wife, Sakshi, posted an image on social media where the trio can be seen having a good time in each other's company. It's hard to miss how cute little Ziva has grown to become.
Please Wait while comments are loading...