సెమీస్‌కు చేరిన పాక్‌: లంకపై మూడు వికెట్ల తేడాతో విజయం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌ సెమీస్‌ ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకపై తడబడింది. టోర్నీలో భాగంగా కార్డిఫ్‌ వేదికగా శ్రీలంకతో జ‌రిగిన‌ మ్యాచ్‌లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో గ్రూప్‌ బి నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

Pakistan bowl first Vs Sri Lanka

237 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఓ వైపు వికెట్లు పడుతున్నా... బ్యాట్స్‌మెన్లు మాత్రం గెలుపు కోసం చివరి వరకు పోరాడారు. ఓ దశలో 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌(61 నాటౌట్‌) అర్ధశతకానికి తోడుగా మహ్మద్‌ ఆమీర్‌(28 నాటౌట్‌) రాణించడంతో పాక్‌ 44.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

పాకిస్థాన్ విజయ లక్ష్యం 237

అంతకముందు ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న జరుగుతోన్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ బౌలర్లు విజృంభించారు. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకను 49.2 ఓవర్లలో 236 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో పాకిస్థాన్ విజయ లక్ష్యం 237 పరుగులుగా నిర్దేశించింది.

అటు ఫాస్ట్ బౌలర్లు, ఇటు మీడియం పేసర్లు విజృంభించడంతో శ్రీలంక పూర్తి ఓవర్లు ఆటకుండానే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక గుణతిలకా(13) వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. ఆ తర్వాత డిక్ వెల్లా అత్యంత జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించాడు.

కుశాల్ మెండిస్‌తో ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు యత్నించాడు. జట్టు స్కోరు 82 పరుగుల వద్ద మెండిస్(27) అవుట్ కావడంతో పాటు, ఆపై వెంటనే చండిమల్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో 83 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో డిక్ వెల్లా(73; 86 బంతుల్లో 4 ఫోర్లు) సాయంతో అర్ధసెంచరీ సాధించాడు.

ఆ తర్వాత మెండిస్(27), మాథ్యూస్(39)లు కూడా నిలకడగా ఆడారు. అయితే జట్టు స్కోరు 161 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా మాథ్యూస్ పెవిలియన్ చేరిన తరువాత లంకేయులు వరుసగా వికెట్లను చేజార్చుకున్నారు. ఆరు పరుగుల వ్యవధిలో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయింది.

Pakistan bowl first Vs Sri Lanka

ఇక చివర్లో గుణరత్నే(27), లక్మాల్(26)లు రాణించడంతో శ్రీలంక 236 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్, హసన్ అలీలు తలో మూడు వికెట్లు సాధించగా, మొహ్మద్ అమిర్, ఫాహీమ్ అష్రాఫ్ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రధానంగా పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ విశేషంగా ఆకట్టుకున్నాడు.

10 ఓవర్ల బౌలింగ్ వేసిన పేసర్ జునైద్ 40 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. జునైద్ వేసిన ఓవర్లలో మూడు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. వన్డే మ్యాచ్‌లో ఒక పాకిస్తాన్ బౌలర్ మూడు అంతకంటే ఎక్కువ మెయిడిన్లు వేయడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2013లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో ఆఫ్రిది మూడు మెయిడిన్ల వేశాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. కార్డిప్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కి, ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది.

 Pakistan bowl first Vs Sri Lanka

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు 

దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. గ్రూప్‌-బిలో జరుగుతున్న చివరి లీగ్‌ మ్యాచ్‌ కూడా ఇదే కావడం విశేషం. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి సెమీస్‌కు చేరాలని ఇరు జట్లూ గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌కు 250వ వన్డే. దీంతో పాక్ తరుపున 250 వన్డేలు ఆడిన బ్యాట్స్‌మన్‌‌గా షోయబ్‌ మాలిక్‌ అరుదైన ఘనత సాధించాడు.

ICC Champions Trophy: Pakistan bowl first Vs Sri Lanka

టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో 124 పరుగుల తేడాతో ఓటమిపాలైనా, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. అయితే పాక్‌ బ్యాటింగ్‌ విభాగం మాత్రం కాస్తంత ఆందోళనగా ఉంది.

ఇక, శ్రీలంక విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ రాణించడంపైనే ఆ జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో డీలాపడిన శ్రీలంక ఆ తరువాత భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించి విజయం సాధించింది.

ఐసీసీ నిర్వహించిన వన్డే టోర్నీల్లో శ్రీలంకపై పాకిస్తాన్ తొమ్మిదిసార్లు గెలవడం ఇక్కడ విశేషం. ఐసీసీ వన్డే టోర్నీల్లో లంకపై పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. 2002 చాంపియన్స్ ట్రోఫీలో ప్రేమదాస స్టేడియంలో జరిగిన వన్డేలో పాక్‌పై శ్రీలంక గెలిచింది. ఇది పాకిస్తాన్‌కు కలిసొచ్చే అవకాశమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జట్ల వివరాలు:
పాకిస్తాన్: సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), అజహర్ అలీ, ఫకార్ జమాన్, బాబర్ అజమ్, మొహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, ఫహీమ్ అష్రాఫ్, మొహ్మద్ అమిర్, హసన్ అలీ, జునైద్ ఖాన్

శ్రీలంక: ఏంజెలో మాథ్యూస్(కెప్టెన్), కుశాల్ మెండిస్, డిక్ వెల్లా, గుణ తిలకా, చండిమాల్, గుణరత్నే, ధనంజయ డిసిల్వా, పెరీరా, లక్మల్, లసిత్ మలింగా, నువాన్ ప్రదీప్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan captain Sarfraz Ahmed won the toss and opted to field first against Sri Lanka in their final group game of ICC Champions Trophy 2017 here today (June 12).
Please Wait while comments are loading...