స్పెషల్ ఫోకస్: ఐసీసీ టోర్నీల్లో ధావన్ ఎందుకంత ప్రత్యేకం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ టోర్నీల్లో ఆడేటప్పుడు సాధారణంగా బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురవుతుంటారు. కానీ శిఖర్ ధావన్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఐసీసీ టోర్నీలంటే చాలు ఎక్కలేని ఉత్సాహం వస్తుంది. 2004 అండర్‌-19 ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2015 వన్డే ప్రపంచకప్‌, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు| స్కోరు కార్డు

అతడు చేసిన అద్భుత ప్రదర్శన వల్లే టీమిండియా ఎన్నో మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మకు జోడీగా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలను అందించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ధావన్-రోహిత్ శర్మల జోడీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ భాగస్వామ్యాలను నెలకొల్పింది.

తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా అరుదైన రికార్డుని సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు ధావన్, రోహిత్ శర్మ నాలుగో సారి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. టోర్నీలో భాగంగా గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 136 పరుగులు సాధించి చాంపియన్స్ ట్రోఫీలో మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు సృష్టించింది. తాజాగా శ్రీలంక మ్యాచ్‌లో సైతం సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించడంతో ఈ జోడీ ఈ ఘనతను నాలుగోసారి తన ఖాతాలో వేసుకుంది. అయితే ఐసీసీ టోర్నీల్లో శిఖర్ ధావన్ జోరు ఇప్పటిది కాదు.

ఐసీసీ టోర్నమెంట్లతో శిఖర్‌ ధావన్‌ అనుబంధం 2004 అండర్‌-19 ప్రపంచకప్‌ నుంచే కొనసాగుతోంది. ఆ టోర్నీలో 84.21 సగటుతో 505 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికైన తర్వాత 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ధావన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

ఐసీసీ టోర్నీల్లో తనదైన ముద్ర

ఐసీసీ టోర్నీల్లో తనదైన ముద్ర

90.75 సగటుతో 363 పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లోనూ ధావన్‌ తన ముద్ర వేశాడు. 51.50 సగటుతో 412 పరుగులు చేసి టీమిండియా సెమీస్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా (137)పై సెంచరీ చేసిన ధావన్ పాకిస్థాన్‌పై అర్ధసెంచరీ నమోదు చేశాడు.

ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో జైత్రయాత్ర

ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో జైత్రయాత్ర

ఇక ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 68, 125, 78 పరుగులు చేసి సత్తా చాటాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీల రికార్డులను సైతం బద్దలు కొట్టాడు.

భారత్ విజయంలో కీలకపాత్ర

భారత్ విజయంలో కీలకపాత్ర

టోర్నీలో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 83 బంతుల్లో 78 పరుగులు చేసిన ధావన్ భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ధావన్‌కి ఇది 19వ అర్ధ సెంచరీ. అంతేకాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇది ధావన్‌కు నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ధావన్ 90.3 యావరేజితో 271 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.

16 ఇన్నింగ్స్‌లతో ధావన్‌ వెయ్యి పరుగులు

16 ఇన్నింగ్స్‌లతో ధావన్‌ వెయ్యి పరుగులు

ఐసీసీ నిర్వహించిన టోర్నీల్లో కేవలం 16 ఇన్నింగ్స్‌ల ద్వారానే ధావన్‌ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. 69.72 యావరేజితో 1046 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. దీంతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా ధావన్‌ సరికొత్త రికార్డును సృష్టించాడు.

ధావన్‌ చేసిన అత్యధిక పరుగులు విదేశీ గడ్డపైనే

ధావన్‌ చేసిన అత్యధిక పరుగులు విదేశీ గడ్డపైనే

గతంలో సచిన్‌ 18 ఇన్నింగ్స్‌ల ద్వారా, గంగూలీ, మార్క్‌ వా 20 ఇన్నింగ్స్‌ల ద్వారా వెయ్యి పరుగులు పూర్తి చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఐసీసీ టోర్నమెంట్లలో ధావన్‌ అత్యధిక పరుగులు విదేశీ గడ్డపైనే సాధించడం. అందులోనూ టాప్‌ జట్లపైనే. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌తో సెమీస్‌లోనూ ధావన్‌ (45) రోహిత్‌తో కలిసి మంచి ఆరంభమే అందించాడు. అదే వరల్డ్ కప్ టోర్నీలో దక్షిణాఫ్రికాపై అద్భుత సెంచరీని కూడా నమోదు చేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకపై కూడా చెలరేగి ఆడాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Impressively, he has the best all-time average when it comes to World Cups and Champions Trophies combined, averaging 69.73 with five hundreds and four fifties, putting him well above Saeed Anwar and Vivian Richards at No.1 on the list.
Please Wait while comments are loading...