ఎట్టకేలకు హఫీజ్ పాస్: ఆస్ట్రేలియా వెళ్లే జట్టులో చోటు!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పాకిస్థాన్ ఆల్ రౌండర్ మొహ్మద్ హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడన్న కారణంతో 2015 జూన్‌లో ఐసీసీ హఫీజ్‌పై నిషేధం విధించింది. ఈ క్రమంలో ఇటీవలే తన బౌలింగ్‌ను సరి చేసుకున్న హఫీజ్ నవంబర్ 17వ తేదీన ఐసీసీ నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యాడు.

ఐసీసీ నిర్వహించిన పరీక్షల్లో హఫీజ్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు లోబడే ఉండటంతో అతడిపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఐసీసీ నివేదికలో పేర్కొంది. ఐసీసీ తాజా నిర్ణయంతో త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే పాకిస్థాన్ జట్టులో హఫీజ్ చోటు దక్కించుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

ICC clears Mohammad Hafeez's bowling action

అయితే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే పాకిస్థాన్ జట్టును ఆ దేశ బోర్డు ఇప్పటికే ఎంపిక చేసింది. అయినా సరే హఫీజ్‌ను ఆలస్యంగా ఆసీస్ పర్యటనకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హఫీజ్ బౌలింగ్‌పై ఐసీసీ క్లీన్ చిట్ ఇవ్వడంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

ఇది నిజంగా తనకు మంచి శుభవార్త అని స్పష్టం చేశాడు. ఇటీవల కాలంలో తాను ఎక్కువగా బ్యాటింగ్ పైనే ఫోకస్ పెట్టినప్పటికీ, జట్టుకు ఆల్ రౌండర్‌గా సేవలందించాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్లు తెలిపాడు.

కాగా, గతేడాది జూన్‌లో శ్రీలంకతో గాలేలో జరిగిన మ్యాచ్‌లో హాఫీజ్ బౌలింగ్ శైలిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అంఫైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఐసీసీ అతడిపై ఏడాది పాటు నిషేధం విధించింది. ఆ తర్వాత పలుమార్లు హఫీజ్ బౌలింగ్ పరీక్షలకు హాజరైనప్పటికీ విఫలమయ్యాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Experienced all-rounder Mohammad Hafeez could be a late addition to Pakistan's Test squad for Australia tour after the ICC on Wednesday cleared his bowling action following remedial work.
Please Wait while comments are loading...