వన్డే ర్యాంకులు: 3వ స్ధానంలో భారత్, అగ్రస్ధానం సఫారీలదే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ సోమవారం వన్డే ర్యాంకులను ప్రకటించింది. తాజా వన్డే ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా రెండో స్ధానంలో నిలవగా, భారత్ ఒక స్ధానాన్ని మెరుగుపరచుకుని మూడో స్ధానంలో నిలిచింది.

న్యూజిలాండ్ మాత్రం ఒక స్థానాన్ని కోల్పోయి నాలుగో ర్యాంకులో నిలిచింది. భారత్ 117 రేటింగ్ పాయింట్లతో మూడు స్ధానంలో నిలవగా, న్యూజిలాండ్ 115 రేటింగ్ పాయింట్లతో వరుసగా నాలుగో స్ధానంలో నిలిచింది.

కాగా, 2019 వరల్డ్ కప్‌లో నేరుగా ఆడాలంటే కావాల్సిన ఎనిమిదో స్థానాన్ని వెస్టిండీస్‌ను తలదన్ని పాకిస్తాన్ కైవసం చేసుకుంది. 2017 సెప్టెంబర్ 30 నాటికి ఇంగ్లాండ్‌తో పాట్ టాప్ 7 ర్యాంకుల్లో ఉన్న జట్లు 2019 ప్రపంచకప్‌ పోటీలకు అర్హత సాధిస్తాయి.

ICC ODI Rankings: South Africa No. 1; India 3rd after annual update

2019 వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. కాబట్టి వరల్డ్ కప్‌ ఇంగ్లండ్‌లో జరుగుతుండటంతో ఆ జట్టు ఇప్పటికే అర్హత సాధించింది. 2016 మే 1వ తేదీ తర్వాత ఆడిన మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుని తాజా ర్యాంకులను నిర్ణయించారు.

పాకిస్తాన్ 90 నుంచి 88 పాయింట్లకు పడిపోగా వెస్టిండీస్ 83 నుంచి 79 పాయింట్లకు పడిపోయింది. దాంతో వెస్టిండీస్ కంటే తొమ్మిది పాయింట్ల ఆధిక్యంలో ఉన్న పాకిస్థాన్ 2019 వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. మరోవైపు ఈ ఏడాది జూన్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి లండన్ ఆతిథ్యమిస్తోంది.

ఈ టోర్నీలో టీమిండియా ఆడుతుందా? లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఐసీసీ వన్డే ర్యాంకులు (మే 1, 2017 నాటికి) ఇలా ఉన్నాయి.

(Read as Rank Team Points)
1. South Africa 123 (+4)
2. Australia 118 (-)
3. India 117 (+5)
4. New Zealand 115 (+2)
5. England 109 (+1)
6. Sri Lanka 93 (-5)
7. Bangladesh 91 (-1)
8. Pakistan 88 (-2)
9. West Indies 79 (-4)
10. Afghanistan 52 (-)
11. Zimbabwe 46 (-2) 12. Ireland 43 (+1)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
South Africa and Australia have retained the top two positions on the ICC ODI Team Rankings following the 1 May annual update. India are placed 3rd.
Please Wait while comments are loading...