పాక్ ర్యాంక్ మెరుగు: 2019 వరల్డ్ కప్‌కు వెళ్లే జట్లు ఇవే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా టైటిల్ విజేతగా నిలిచిన పాకిస్థాన్ వన్డే ర్యాంకింగ్స్‌లో తన ర్యాంకుని మెరుగుపరచుకుంది. టోర్నీ అనంతరం సోమవారం విడుదల చేసిన వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్ రెండు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచింది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు 

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగి రన్నరప్‌తో సరిపెట్టుకున్న టీమిండియా మూడో స్థానంలో నిలిచింది. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం 95 రేటింగ్ పాయింట్లను సాధించిన పాకిస్తాన్ ఆరో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఇక బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచి 2019 వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను సజీవంగా ఉంచుకున్నాయి. ఇంగ్లాండ్ ఆతిథ్య మివ్వనున్న ఈ టోర్నీలో కటాఫ్‌ తేదీ అయిన ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు టాప్‌ 8లో నిలిచిన జట్లు నేరుగా టోర్నీలో పాల్గొంటాయి.

ICC ODI Team Rankings: Pakistan move to 6th after CT win, India 3rd

ఇదిలా ఉంటే బ్యాటింగ్‌ విభాగంలో కోహ్లీ 861 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపర్చుకుని పదో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీతో మురిపించిన పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్‌ 97వ ర్యాంక్‌ సాధించాడు. బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగు స్థానాలు ఎగబాకి 19వ ర్యాంక్‌లో నిలిచాడు.

ఐసీసీ వన్డే ర్యాంకులు (ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత, జూన్ 19 నాటికి)
(ర్యాంకు, జట్లు, పాయంట్లు)
1 South Africa 119
2 Australia 117
3 India 116 (-1)
4 England 113 (-1)
5 New Zealand 111
6 Pakistan 95 (+4)
7 Bangladesh 94 (-1)
8 Sri Lanka 93
9 West Indies 77
10 Afghanistan 54
11 Zimbabwe 46
12 Ireland 41

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan have moved to 6th position in the ICC ODI Team Rankings following its triumph at the ICC Champions Trophy 2017, and its players have made significant gains in the individual rankings following their 180-run victory over India in the final on Sunday (June 19).
Please Wait while comments are loading...