భారత క్రికెట్‌ను చంపేందుకు ఐసీసీ యత్నం: శాస్త్రి సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu
హైదరాబాద్: బీసీసీఐ పట్ల ఐసీసీ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐ పట్ల ఐసీసీ తప్పుగా వ్యవహరిస్తోందని మండిపడ్డాడు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ ఐసీసీకి ఎక్కువ నిధులు బీసీసీఐ నుంచే వెళ్తున్నాయని అన్నారు.

అలాంటి బీసీసీఐకి పెద్ద మొత్తంలో షేర్ ఇచ్చేందుకు ఐసీసీ నిరాకరించడాన్ని రవిశాస్త్రి తప్పుపట్టారు. ప్రసుత్తం బీసీసీఐ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల నుంచి లబ్ది పొందాలనుకుంటున్న వారికి రవిశాస్త్రి వార్నింగ్ ఇచ్చాడు. అత్యధిక రెవెన్యూను అందించే బోర్డుగా, ఐసీసీ నుంచి తనకు రావాల్సిన ప్రతి పైసాను బీసీసీఐ డిమాండ్‌ చేయాలన్నాడు.

లబ్ది పొందాలనుకునే వారికి ఇదే నా హెచ్చరిక

లబ్ది పొందాలనుకునే వారికి ఇదే నా హెచ్చరిక

‘లబ్ది పొందాలనుకునే వారికి ఇదే నా హెచ్చరిక. అనిశ్చితి చిరకాలం ఉండదు. అతిత్వరలో బీసీసీఐ మునుపటి ప్రభను సంతరించుకుంటుంది. అందుకే తన చేతిలో ఉన్న దానిపై బోర్డు ఒత్తిడి పెంచాలి' అని రవిశాస్త్రి సూచించాడు. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా బోర్డులను ఉద్దేశించే రవిశాస్త్రి ఇలాంటి హెచ్చరికలు చేసినట్టుగా తెలుస్తోంది.

బోర్డుకు మద్దతుగా నిలిచిన శాస్త్రి

బోర్డుకు మద్దతుగా నిలిచిన శాస్త్రి

ఐసీసీ ఆదాయంలో సింహ భాగం కావాలనే బోర్డు డిమాండ్‌ను శాస్త్రి సమర్ధించాడు. ‘దుబాయ్‌లో ఐసీసీ సమావేశాలకు వెళ్లిన బీసీసీఐ ప్రతినిధులు.. వాస్తవాలను ఐసీసీ దృష్టికి తీసుకెళ్లడంలో సమర్థంగా వ్యవహరించారు. ఐసీసీ టోర్నీల నుంచి వచ్చే ప్రతీ రూపాయి పైనా హక్కుంది. భారత ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించగలదు' అని అన్నాడు.

80 శాతం ఆదాయం భారత్ నుంచే వస్తుంది

80 శాతం ఆదాయం భారత్ నుంచే వస్తుంది

‘ఐసీసీ టోర్నీలకు సంబంధించిన సుమారు 80 శాతం ఆదాయం భారత్ నుంచే వస్తుంది. అధిక వాటా అడుగుతున్నారు కాబట్టి భారత దౌర్జన్యం చేస్తుందని అంటున్నారా? అలాగైతే నా దృష్టిలో అంతకంటే చెత్త మరొకటి ఉండదు. బీసీసీఐ ఏమీ 80 శాతం ఆదాయం ఆడగడం లేదు. చాలా తక్కువ మాత్రమే ఇవ్వాలంటోంది. భారత నుంచి వచ్చే ఆదాయాన్ని మినహాయిస్తే.. ఎంత మిగులుతుందో చూడాలని ఉంది' అని రవిశాస్త్రి అన్నాడు.

అన్ని దేశాలతో పోలిస్తే భారత్‌కే ఎక్కువ వాటా రావాలి

అన్ని దేశాలతో పోలిస్తే భారత్‌కే ఎక్కువ వాటా రావాలి

అయితే ఐసీసీకి ఎక్కువ నిధులు అందిస్తున్న భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులను బిగ్ త్రిగా లెక్కలోకి తీసుకుని ఎక్కువ నిధులు అందించాలని గతంలో బీసీసీఐ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో భారత్‌కు అన్ని దేశాలతో పోలిస్తే ఎక్కువ వాటా దక్కనుంది.

బీసీసీఐకి మద్దుతుగా నిలిచిన శ్రీలంక

బీసీసీఐకి మద్దుతుగా నిలిచిన శ్రీలంక

ఐసీసీ అండతో ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు ఒక్క శ్రీలంక తప్ప మిగతా అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమలో బీసీసీఐకి మద్దుతిచ్చిన శ్రీలంకను రవిశాస్త్రి అభినందించాడు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌, జింబాబ్వే ఐసీసీ పక్షం వహించడం నిరాశకు గురి చేసిందని చెప్పాడు. తాను ఈ స్థితిలో ఉన్నానంటే బీసీసీఐ ఇచ్చిన అవకాశాల వల్లేనని చెప్పుకొచ్చాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
They are making the biggest mistake in doing so. You hit the nail on the head. My warning to such people is beware. This institution is here to stay. They are making the mistake of trying to take advantage of the BCCI in this situation. This state of flux will not last for long.
Please Wait while comments are loading...