టెస్టు ర్యాంకింగ్స్: భారత్ నెంబర్ వన్, దిగజారిన పాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం టెస్టు ర్యాంకుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 2వ స్ధానంలో ఉన్న పాకిస్థాన్ 4వ స్ధానానికి పడిపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఓటమి పాలవ్వడమే ఇందుకు కారణం.

115 పాయింట్లతో భారత జట్టు తన నెంబర్ వన్ స్ధానాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరిస్‌లో పాల్గొనడానికి ముందు 109 పాయింట్లో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. అయితే న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌ను 2-0తో కోల్పోవడంతో 102 పాయింట్లకు పడిపోయింది.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు 105 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ, డెసిమల్ పాయింట్లలో ఇంగ్లాండ్ ముందు ఉండటంతో రెండో స్దానాన్ని కైవసం చేసుకుంది. మూడో స్ధానంలో ఆస్ట్రేలియా నిలిచింది. మిగతా జట్లతో పోలిస్తే భారత్ 10 పాయింట్ల ఆధిక్యంలో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతోంది.

ICC Test Rankings: Pakistan slip to 4th place, India remain No. 1

పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో 5 పాయింట్లు సాధించి ఆరో స్ధానంలో నిలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో తొలి నాలుగు జట్లు 10 పాయింట్ల తేడా ఉండగా, ఆ తర్వాతి జట్లు 20 పాయింట్ల తేడాతో ఉన్నాయి. నవంబర్ 29, 2016 నాటికి ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్:

1. భారత్ (115 rating points)
2. ఇంగ్లాండ్ (105)
3. ఆస్ట్రేలియా (105)
4. పాకిస్థాన్ (102)
5. దక్షిణాఫ్రికా (102)
6. న్యూజిలాండ్ (96)
7. శ్రీలంక (96)
8. వెస్టిండిస్ (69)
9. బంగ్లాదేశ్ (65)
10. జింబాబ్వే (5)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan have slipped from 2nd to 4th position in the International Cricket Council (ICC) Test Team Rankings after their 2-0 loss to New Zealand in their two-match series which culminated with a 138-run verdict in Hamilton on Tuesday (November 29). India continue to remain on top of the rankings.
Please Wait while comments are loading...