ఫోటోలు: అశ్విన్‌దే నెంబర్ వన్, టెస్టుల్లో టాప్ 5 వీరే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బుధవారం ఐసీసీ టెస్టు ర్యాంకులను ప్రకటించింది. ఐసీసీ విడుదల చేసిన జాబితాలో టీమిండియా స్టార్ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన నెంబర్ వన్ స్ధానాన్ని నిలబెట్టుకున్నాడు. తమిళనాడుకు చెందిన అశ్విన్ ఆల్ రౌండర్ల జాబితాలో కూడా నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నాడు.

ఇంగ్లాండ్‌తో మొహాలి వేదికగా జరిగిన టెస్టులో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించిన రవీంద్ర జడేజాను 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.

దీంతో టెస్టు ర్యాంకుల్లో జడేజా రెండు స్ధానాలు ఎకబాకి నాల్గవ స్ధానంలో నిలిచాడు. తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకుని అందుకున్నాడు. 42 టెస్టు మ్యాచ్‌లాడిన అశ్విన్ అత్యంత వేగంగా రెండొందలకు పైగా వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు.

ఇక టెస్టుల్లో ఇప్పటి వరకు అశ్విన్ 235 వికెట్లు తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టులో ఆరు వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ హాజెల్ ఉడ్ తొలిసారి టాప్ 5లో స్ధానాన్ని సంపాదించాడు. నాలుగు స్ధానాలు ఎగబాకి ఐదో స్ధానంలో నిలిచాడు.

ఇక టీమిండియా యువ పేసర్ మహ్మద్ షమీ రెండు స్ధానాలు ఎగబాకి 19వ స్ధానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ నాలుగు స్ధానాలు పైకి ఎగబాకి 21వ స్ధానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ అబ్బాట్ ఏకంగా ఏడు స్దానాలు ఎగబాకి 29వ స్ధానంలో నిలిచాడు.

493 పాయింట్లతో భారత్‌కు చెందిన అశ్విన్ నెంబర్ వన్ స్దానంలో కొనసాగుతుండగా, 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ జాక్వస్ కల్లిస్ తర్వాత ఆ దేశానికి చెందిన ఏ ఒక్క ఆల్ రౌండర్ కూడా టాప్ టెన్ స్ధానాల్లో చోటు దక్కించుకోకపోవడం విశేషం.

రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్


891 రేటింగ్ పాయింట్లతో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్నాడు.

రంగనా హెరాత్

రంగనా హెరాత్


876 రేటింగ్ పాయింట్లతో శ్రీలంకకు చెందిన స్పిన్నర్ రంగనా హెరాత్ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో రెండో స్ధానంలో నిలిచాడు.

డేల్ స్టెయిన్

డేల్ స్టెయిన్


844 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో మూడో స్ధానంలో నిలిచాడు.

జేమ్స్ ఆండర్సన్

జేమ్స్ ఆండర్సన్


834 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ ఆండర్సన్ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో నాలుగో స్ధానంలో నిలిచాడు.

హాజెల్ ఉడ్

హాజెల్ ఉడ్


దక్షిణాఫ్రికాతో అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టులో ఆరు వికెట్లు తీసుకున్న ఆసీస్ ఫాస్ట్ బౌలర్ హాజెల్ ఉడ్ తొలిసారి టాప్ 5లో నిలిచాడు. 815 రేటింగ్ పాయింట్లతో ఒకేసారి నాలుగు స్ధానాలు ఎగబాకి ఐదో స్ధానంలో నిలిచాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's frontline spinner Ravichandran Ashwin has maintained his domination as number one bowler in current International Cricket Council (ICC) Rankings for Test cricket.
Please Wait while comments are loading...