న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్ పైనల్లో భారత్: ఆస్ట్రేలియాపై విజయం, 2005 తర్వాత మళ్లీ

ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌కి వర్షం అడ్డు పడింది. దీంతో డెర్బీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కి వరుణుడు అడ్డు పడటంతో టాస్ సాధ్యం.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం రెండో సెమీపైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఫైనల్‌ చేరింది. 282 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.

Rain delays toss between India and Australia

దీంతో ఆస్ట్రేలియాపై టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. మిడిలార్డర్‌లో విలానీ 58 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 75 పరుగులు, చివర్లో బ్లాక్‌వెల్‌ 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 90 పరుగులు చేసిన ప్రయోజనం లేకపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, జులన్‌ గోస్వామి, శికా పాండే చెరో రెండు వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. అంతకముందు వర్షం, మైదానం చిత్తడిగా ఉండటంతో 42 ఓవర్లకు మ్యాచ్‌ని కుదించారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల కోల్పోయి 281 పరుగులు చేసింది. ఆసీస్‌పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. తాజా విజయంతో 2005 తర్వాత వరల్డ్ కప్‌లో మరోసారి ఫైనల్‌ చేరినట్లు అయింది.

ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 282:

ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 282 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలో తడబడింది.

వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత టీమిండియా బ్యాట్స్ ఉమెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలో జట్టు స్కోరు 101 పరుగుల వద్ద మిథాలీ 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది.

ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సులతో 171 పరుగులతో అజేయంగా నిలిచింది. నాలుగో వికెట్‌కు దీప్తి శ‌ర్మ‌, కౌర్‌లు 137 పరుగులు జోడించగా, అయిదో వికెట్‌కు కౌర్‌, కృష్ణ‌మూర్తిలు అజేయంగా 43 పరుగులు జోడించారు. ఆసీస్ బౌలర్లలో విల్లాని, బీమ్స్, గార్డెనర్, మెగాన్ తలో వికెట్ తీశారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే.

హర్మన్ ప్రీత్ కౌర్‌ సెంచరీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీ చేసింది. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా అద్భుత సెంచరీతో చెలరేగింది. 90 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లో సెంచరీ బాదింది. హర్మన్ దెబ్బకు టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ప్రస్తుతం హర్మన్ ప్రీత్ కౌర్ (100), దీప్తి శర్మ (20) క్రీజులో ఉన్నారు.

Rain delays toss between India and Australia

మిథాలీ రాజ్ అవుట్: కష్టాల్లో టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్ పోరులో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 101 పరుగుల వద్ద కెప్టెన్ మిథాలీ రాజ్ (36) బౌల్డ్ అయింది. దీంతో 25 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 6 పరుగుల వద్ద స్మృతి మందన (6) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 35 పరుగుల వద్ద పూనమ్ రౌత్ (14) పెవిలియన్‌కు చేరగా ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ నిలకడగా ఆడుతూ హర్మన్ ప్రీత్ కౌర్‌ సహకారంతో స్కోరు బోర్డుని పరిగెత్తించారు. అయితే జట్టు స్కోరు 101 పరుగుల వద్ద 25 ఓవర్ చివరి బంతికి క్రిస్టెన్ బీమ్స్ బౌలింగ్‌లో మిథాలీ బౌల్డ్ అయింది.

Raj

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ పైనల్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 35 పరుగుల వద్ద గార్డెనర్ బౌలింగ్‌లో పూనమ్ రౌత్ (14) బెత్ మూనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 16, హర్మన్ ప్రీత్ కౌర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మళ్లీ నిరాశ పరిచిన స్మృతి మందాన
డెర్బీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఉమెన్ వరల్డ్‌లో భారత్ తొలి ఓవర్ చివరి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు ఆరు పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ స్మృతి మందన (6) ష్యుట్ బౌలింగ్‌లో విలానీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.. దీంతో 3 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి టీమిండియా 8 పరుగులు చేసింది. మందాన అవుటైన తర్వాత మిథాలీ రాజ్ క్రీజులోకి వచ్చింది.

మైదానంలో అడుగుపెడుతున్న ఇరు జట్లు:

సమాలోచనలో ఇరు జట్లు:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా:

ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ పైనల్లో టాస్ గెలిచిన భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అంతకముందు వర్షం అడ్డింకిగా మారడంతో మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. కాగా, ఈ స్టేడియంలో జరిగిన అన్ని మ్యాచుల్లోనూ టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొని విజయం సాధించింది.

మరోవైపు ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. వర్షం కారణంగా మ్యాచ్‌ను చెరోవైపు 42 ఓవర్లకు కుదించారు. ఇద్దరు బౌలర్లు తొమ్మిది, ముగ్గురు బౌలర్లు ఎనిమిదేసి ఓవర్లు వేస్తారు. వర్షం కారణంగా మ్యాచ్‌ మధ్యలోనే నిలిచిపోతే ఏ ఓవర్‌లో ఆగిపోయిందో అక్కడి నుంచి శుక్రవారం ఆడిస్తారు.

శుక్రవారం కూడా మ్యాచ్ జరగకుంటే లీగ్‌ దశలో 12 పాయింట్లతో ముందంజలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

 ICC Women's World Cup

అడ్డంకిగా మారిన వర్షం

ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌కి వర్షం ఆటంకిగా మారింది. దీంతో డెర్బీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కి వరుణుడు అడ్డు పడటంతో టాస్ సాధ్యం కాలేదు. ప్ర‌స్తుతం గ్రౌండ్ అంతా క‌వ‌ర్లు క‌ప్పి ఉంచారు.

బ్రిటిష్‌ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 తర్వాత మ్యాచ్‌ ప్రారంభమైతే ఓవర్లు కుదిస్తారు. కుదించిన ఓవర్లతో ఆట ప్రారంభమై నిలిచిపోతే శుక్రవారం మ్యాచ్‌ను కొనసాగిస్తారు. రెండు రోజులూ మ్యాచ్‌ నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేకుంటే లీగ్‌ దశలో 12 పాయింట్లతో ముందంజలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాతో మిథాలీ సేన తలపడుతుంది. ఆరుసార్లు విశ్వ‌విజేత అయిన ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్‌లో ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే 2005 తర్వాత వరల్డ్ కప్‌లో మరోసారి ఫైనల్‌ చేరినట్లవుతుంది.

జట్ల వివరాలు:

భారత్:

ఆస్ట్రేలియా:

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X