ఆదరణలో రికార్డు స్థాయి: 300 శాతం పెరిగిందన్న ఐసీసీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇటీవలే ముగిసిన ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌కి రికార్డు స్థాయిలో ఆదరణ లభించింది. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది ఈ టోర్నీని తిలకించినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. అంతేకాదు 2013 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఈ టోర్నీ వీక్షణ సమయంలో 300 శాతం పెరిగినట్లు ఐసీసీ పేర్కొంది.

అదే సమయంలో భారత్, దక్షిణాఫ్రికాల్లో అత్యధిక మంది ప్రేక్షకులు మ్యాచ్‌లను వీక్షించినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో మిథాలీ నేతృత్వంలోని టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

భారత్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా

భారత్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా

భారత్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 15.6 కోట్ల మంది మహిళల ప్రసారాలను వీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది కోట్ల మంది చూడగా, ఒక్క ఫైనల్ పోరును 12.6 కోట్ల మంది వీక్షించారు. భారత జట్టు ఫైనల్‌కు చేరడంతో భారత్‌లో వీక్షణ సమయం 500 శాతానికి పెరిగింది. దీనిపై ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్ సన్ హర్షం వ్యక్తం చేశారు. 'మహిళల క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానిక ఇదే తగిన సమయం. ఈ మెగా టోర్నీతో మహిళల క్రికెట్ ఆదరణ పెరిగింది. దానికి నిదర్శనం ఈ లెక్కలే' అని ఆయన పేర్కొన్నారు.

తొలిసారి సెమీఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా

తొలిసారి సెమీఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా

ఇక దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి సెమీఫైనల్‌కు చేరడంతో ఆ దేశంలో వీక్షణ సమయం అనూహ్యంగా 861 శాతం పెరిగింది. ఇక ఆసీస్ విషయానికి 131 శాతం పెరుగుదల కనిపించింది. బ్రిటన్‌లో ఈ మధ్య జరిగిన క్రికెట్‌ పోటీల్లో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌నే ఎక్కువ మంది వీక్షించారు.

సోషల్ మీడియాలో సైతం

సోషల్ మీడియాలో సైతం

సోషల్ మీడియాలో సైతం ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ తన హవా కొనసాగించింది. ఐసీసీ డిజిటల్‌ వేదికల్లో 10 కోట్ల వీడియోలను వీక్షించారు. #wwc17 హ్యాష్‌ట్యాగ్‌ను పది లక్షల మంది ట్వీట్‌ చేశారు. 2013తో పోలిస్తే ఇది 24 రెట్లు అధికంగా ఉంది. ఇక ఫైనల్‌లో కూడా హ్యాష్‌ట్యాగ్‌కూ పెద్ద ఆదరణ లభించింది. ఇక కెప్టెన్ల ఎమోజీల వినియోగం 2013తో పోలిస్తే 875 రెట్లు పెరిగింది.

50,000 ఆర్టికల్స్

50,000 ఆర్టికల్స్

వరల్డ్ కప్ గురించి 100 దేశాల్లో వెబ్‌, ప్రింట్‌ మీడియాలో 50,000 కథనాల రూపంలో వచ్చాయి. ఇక భారత్‌ విషయానికి వస్తే 16,000 కథనాలతో అందరి కన్నా మిథాలీసేన ముందు వరుసలో నిలిచింది. బ్రిటన్‌ 14,000, ఆస్ట్రేలియా 9,000తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In what could be termed as another confidence booster for women's cricket, recently concluded ICC Women's World Cup 2017 witnessed a whopping increase in its viewership. As per a latest ICC release, the global viewing hours for Women's World Cup grew by almost three times.
Please Wait while comments are loading...