షెడ్యూల్, వేదికలు: ఉమెన్ వరల్డ్ కప్‌లో ఆడే భారత జట్టు ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జూన్ 23 నుంచి ప్రారంభం కానున్న మహిళల వరల్డ్ కప్ మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. ఈ టోర్నీలో టీమిండియాకు హైదరాబాద్‌కు చెందిన మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

మిథాలీ రాజ్‌కు 100 వన్డేల్లో టీమిండియాకు సారథిగా వ్వవహరించిన అనుభవం ఉంది. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మిథాలీ రాజ్ రెండో స్ధానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం టీమిండియా ఐసీసీ ర్యాంకుల్లో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.

India at Women's World Cup 2017: Squad, Venues, Schedule

టోర్నీకి ముందు వరకు ఆడిన 17 మ్యాచ్‌ల్లో టీమిండియా 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మిడిల్ ఆర్డర్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వన్డే చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఝలన్ గోస్వామి జట్టుకు అదనపు బలం.

ఇటీవల కాలంలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. వరుసగా గత నాలుగ వన్డే సిరిస్‌ల్లో జయకేతనం ఎగురేసింది. ఇక ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ విషయానికి వస్తే లీగ్ స్టేజిలో అన్ని జట్లు 7 గేమ్‌లు ఆడతాయి. లీగ్ స్టేజి టాప్‌లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌లో తలపడతాయి.

ఉమెన్ వరల్డ్ కప్‌లో టీమిండియా షెడ్యూల్, వేదికలు:
24 జూన్: India Women Vs England Women in Derby at 3 PM (IST)
29 జూన్: India Women Vs West Indies Women in Taunton at 3 PM (IST)
2 జులై: India Women Vs Pakistan Women in Derby at 3 PM (IST)
5 జులై: India Women Vs Sri Lanka Women in Derby at 3 PM (IST)
8 జులై: India Women Vs South Africa Women in Leicester at 3 PM (IST)
12 జులై: India Women Vs Australia Women in Bristol at 3 PM (IST)
15 జులై: India Women v New Zealand Women in Derby at 3 PM (IST)

జులై 18: Semi-Final 1
జులై 20: Semi-Final 2
జులై 23: Final

టీమిండియా:
మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన, వేద కృష్ణమూర్తి, మోనా మెశ్సం, పూనమ్ రౌత్, దీప్తి శర్మ, ఝులన్ గోస్వామి, శికా పాండే, ఏక్తా బిస్త్, సుష్మా వర్మ (వికెట్ కీపర్), మన్ష్మి జోషి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, నౌజత్ పార్వీన్ (వికెట్ కీపర్).

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian Women's national team is all set to start their campaign in the upcoming ICC Women's World Cup 2017 in England and Wales.
Please Wait while comments are loading...