మొహాలి విజయం: కోహ్లీకి 12, నమోదైన రికార్డులివే

Posted By:
Subscribe to Oneindia Telugu

మొహాలి: ఇంగ్లాండ్‌తో మొహాలి వేదికగా జరిగిన మూడో టెస్టులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. మరో రోజు మిగిలుండగానే ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరిస్‌లో 2-0తో ఆధిక్యాన్ని సాధించింది.

మూడో టెస్టులో అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించిన రవీంద్ర జడేజాను 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు వరించింది. ముఖ్యంగా మొహాలి టెస్టులో భారత్‌ గడ్డపై భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగలమన్న ఇంగ్లీషు ఆటగాళ్ల ఆత్మస్థయిర్యాన్ని భారత స్పిన్నర్లు భలేగా దెబ్బతీశారు.

స్వదేశంలో తన ఆధిపత్యాన్ని కొనసాగింపుగా మొహాలి టెస్టులో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసింది. మూడో రోజే మ్యాచ్‌పై పట్టు సాధించినప్పటికీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు రూట్‌, హమీద్‌ నిలకడగా రాణించి భారత విజయాన్ని కాస్తంత ఆలస్యం చేశారు. చివరకు భారత స్పిన్నర్ల ముందు తలొంచారు.

మొహాలి టెస్టులో టీమిండియా పలు రికార్డులను నమోదు చేసింది. అవేంటంటే:

14 ఏళ్ల తన కెరీర్‌లో పార్ధీవ్ తొలి సిక్స్

14 ఏళ్ల తన కెరీర్‌లో పార్ధీవ్ తొలి సిక్స్

మొహాలి టెస్టులో పార్థివ్ పటేల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2002లో ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగ్రేటం చేసిన పార్ధీవ్ పటేల్ 14ఏళ్ల తర్వాత తొలి సిక్స్ కొట్టాడు. ఇప్పటివరకు 21 టెస్ట్‌ల్లో 110 ఫోర్లు కొట్టిన పార్థివ్‌కు సిక్స్ కొట్టడానికి ఇంత సుదీర్ఘ సమయం పట్టింది. అంతేకాదు పార్ధీవ్ పటేల్ టెస్టుల్లో మళ్లీ అర్ధ సెంచరీ సాధించడానికి పట్టిన సమయం 12 ఏళ్ల 44రోజులు. చివరిసారిగా ఆస్ట్రేలియాపై 2004లో అర్ధసెంచరీ చేసిన పార్థివ్ పటేల్ ఇన్నాళ్లకు మళ్లీ మొహాలీలో ఇంగ్లాండ్‌పై అర్ధసెంచరీని సాధించాడు. గతంలో భారత్ నుంచి లాలా అమర్‌నాథ్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఇంగ్లాండ్‌పై 1933లో సెంచరీ చేసిన అమర్‌నాథ్ మళ్లీ 1946లో అర్ధసెంచరీ కొట్టాడు (12 ఏళ్ల 190 రోజులు).

కెప్టెన్‌గా కోహ్లీకి 12వ టెస్టు విజయం

కెప్టెన్‌గా కోహ్లీకి 12వ టెస్టు విజయం

మొహాలి టెస్టు కెప్టెన్‌గా కోహ్లీకిది 12వ టెస్టు విజయం. కోహ్లీ కెప్టెన్సీలో 20 టెస్టు మ్యాచ్‌లాడిన టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో ఆడి ఆరు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. ధోనీ తన తొలి 20 మ్యాచ్‌ల్లో పన్నెండింటిలో నెగ్గి, రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవి చూశాడు. మిగతా కెప్టెన్లలో స్టీవ్‌వా(15), మై బ్రేర్‌లీ(14), లిండ్సే హస్సెల్(14), మైఖేల్ వాన్(14), రికీ పాంటింగ్(13)లు ఉన్నారు.

పదమూడింటిలో ఏడు మ్యాచ్‌ల్లో విజయం

పదమూడింటిలో ఏడు మ్యాచ్‌ల్లో విజయం

మొహాలీలో టీమిండియా 13 టెస్టు మ్యాచ్‌లాడగా అందులో ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మిగతా ఆరు మ్యాచ్‌ల్లో ఐదు డ్రాగా ముగిస్తే, ఒక్క మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అది సరిగ్గా 22 ఏళ్ల క్రితం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. గత ఇరవై ఏళ్లలో ఒక వేదికపై విజయాల పరంగా(7-0) ఏ జట్టుకైనా ఇది మూడో అత్యుత్తమ ప్రదర్శన.

టీమిండియాకు వరుసగా 16వ టెస్టు విజయం

టీమిండియాకు వరుసగా 16వ టెస్టు విజయం

ఇంగ్లాండ్‌తో మొహాలి వేదికగా గెలిచిన విజయం టీమిండియాకు వరుసగా 16వ టెస్టు విజయం. అంతేకాదు ఓటమి లేకుండా భారత జట్టు వరుసగా తన విజయ పరంపరను కొనసాగించడం ఇది రెండోసారి. గతంలో 1985-87 మధ్య కాలంలో టీమిండియా వరుసగా 17 టెస్టు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన రికార్డు సృష్టించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
7 Tests won by India out of the 13 they have played in Mohali; The only time they lost at this venue was in the inaugural Test at the venue, against West Indies 22 years ago. Since then India have won seven and drawn five matches. Their win-loss record of 7-0 at here is the third-best for any team at any venue the last 20 years.
Please Wait while comments are loading...