లండన్‌లో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీకి కేఎల్ రాహుల్‌ దూరం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జూన్ 1 నుంచి లండన్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భుజం గాయం నుంచి కేఎల్ రాహుల్ ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఆరు అర్ధసెంచరీలు: ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు

భుజం గాయం కారణంగా ఐపీఎల్ పదో సీజన్‌కు కేఎల్ రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. భారత్-ఆస్ట్రేలియాల మధ్య టెస్టు సిరిస్‌లో భాగంగా పూణెలో జరిగిన టెస్టులో రెండో రోజు ఆటలో రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే.

టెస్టు సిరిస్ ముగిసిన అనంతరం సర్జరీ కోసం రాహుల్‌ ఇంగ్లాండ్‌ వెళ్లాడు. దీంతో సుమారు రెండు నెలలపాటు రాహుల్‌ విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ సందర్భంగా ఓ జాతీయ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో రాహుల్ మాట్లాడాడు.

India opener KL Rahul ruled out of Champions Trophy 2017

'ఛాంపియన్స్‌ టోర్నీలో నేను పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గాయం కారణంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌లో అన్ని స్ధానాల్లో బ్యాటింగ్‌ చేయలేకపోయాను. మంచి షాట్స్‌ ఆడలేకపోయాను. తరచూ వ్యాయామం వేస్తూ, గాయం వద్ద బ్యాండేజ్‌ వేసుకుని సిరీస్‌లో పాల్గొన్నాను' అని రాహుల్‌ తెలిపాడు.

సర్జరీ అనంతరం 2 నుంచి 3నెలల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని రాహుల్ తెలిపాడు. పూర్తి స్థాయిలో ఎప్పటికి కోలుకునేది చెప్పలేనని, రెండు మూడు వారాల తర్వాత ఫిజియోథెరపి ప్రారంభిస్తారని చెప్పాడు.

గతంలోనూ రెండుమూడు సార్లు గాయాలపాలై జట్టుకు దూరమయ్యానని, వీలైనంత త్వరగా కోలుకుని వంద శాతం ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి జట్టులో స్థానం సంపాదిస్తానని కేఎఎల్ రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

చివరిసారిగా భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరిస్‌లో ఆడిన కేఎల్ రాహుల్ ఏడు ఇన్నింగ్స్‌ల ద్వారా 393 పరుగులు సాధించిన రాహుల్‌ అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's opening batsman KL Rahul will miss the ICC Champions Trophy 2017 in June due to shoulder injury, that has kept him out of the ongoing Indian Premier League (IPL).
Please Wait while comments are loading...