2-1తో టెస్టు సిరిస్ కైవసం: టీమిండియాపై ప్రశంసల జల్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నిర్ణయాత్మక నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు తమదైన శైలిలో సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

రెండో ఇన్నింగ్స్‌లో 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 23.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో భారత్ దక్కించుకుంది. తద్వారా టెస్టుల్లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగించింది.

India reclaim Border-Gavaskar Trophy: Cricketing world congratulates Virat Kohli & Co

అంతేకాదు స్వదేశంలో వరుసగా ఏడు టెస్టు సిరిస్‌లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ సీజన్‌ను టీమిండియా నెంబర్ వన్ ర్యాంకుతో ముగించింది. స్వదేశంలో 2015 నుంచి భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్‌లో స్వదేశంలో 25 టెస్టులు ఆడిన టీమిండియా ఏకంగా 21 విజయాలు నమోదు చేసింది.

ఇందులో రెండు టెస్టుల్లో ఓటమి పాలవ్వగా, మరో టెస్టులను డ్రాగా ముగించింది. ఇక టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక సీజన్‌లో 82 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇక కోహ్లీ స్థానంలో 33వ టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన రహానే తొలి విజయాన్ని అందుకున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India defeated Australia by eight wickets in the fourth and final cricket Test to claim the four-match series 2-1 at the HPCA stadium, here on Tuesday (March 28).
Please Wait while comments are loading...