లంకపై భారీ విజయం: ఆసియా కప్‌లో భారత్ హవా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు దూసుకుపోతుంది. టోర్నీలో భాగంగా బ్యాంకాక్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మైదానంలో గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లకు గాను భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ మిథాలీ రాజ్ (62) అర్ధ సెంచరీతో రాణించగా, మందనా (21), వేదా కృష్ణమూర్తి (21) పరుగులు సాధించారు.

India register convincing 52-run win over Sri Lanka in Women's Asia Cup T20

అనంతరం 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టు 69 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక జట్టు స్కోరు 16 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దిలానీ మండోదర (20), ప్రశాదనీ వీరక్కోడి(14)లు మాత్రమే రెండంకెల స్కోరుని అందుకున్నారు.

మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో శ్రీలంక ఘోర ఓటమి పాలైంది. భారత మహిళల జట్టులో ఏక్తా బిస్త్, ప్రీతి బోస్‌లు చెరో మూడు వికెట్లు తీసుకోగా, జులాన్ గోస్వామి, అనుజా పటేల్, పూనమ్ యాదవ్‌లు తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించిన మిథాలీ రాజ్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఈ విజయం ఈ టోర్నీలో భారత్‌కు నాలుగో విజయం కావడం విశేషం. అంతకుముందు బంగ్లాదేశ్, థాయ్ లాండ్, పాకిస్తాన్‌లపై భారత్ వరుసగా విజయాల్ని సాధించింది. శుక్రవారం నాడు తదుపరి మ్యాచ్ నేపాల్‌తో ఆడనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India Women registered a smooth and convincing 52-run win over Sri Lanka Women, in Match 12 of the ongoing Women's Asia Cup 2016, at Bangkok.
Please Wait while comments are loading...