320: ప్రపంచ రికార్డు నెలకొల్పన భారత మహిళా క్రికెటర్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత మహిళా క్రికెటర్లు తిరుగులేని రికార్డులు సృష్టిస్తున్నారు. వన్డేల్లో అత్యధిక వికెట్లు (181) తీసిన క్రికెటర్‌గా జులన్‌ గోస్వామి ఘనత సాధించిన వారం రోజుల్లోనే టీమిండియా మహిళ క్రికెటర్ దీప్తి శర్మ అరుదైన రికార్డు నెలకొల్పింది.

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న చతుర్ముఖ వన్డే సిరీస్‌లో సోమవారం ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసి అరుదైన ఘనతను సాధించింది.27 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 160 బంతుల్లోనే 188 పరుగులు చేసింది. తద్వారా వన్డే క్రికెట్‌లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.

అంతేకాదు వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో మహిళా క్రికెటర్‌గా దీప్తి శర్మ నిలిచింది. 1997లో డెన్మార్క్‌పై బిలిందా క్లార్క్ చేసిన 229 పరుగులే ఇప్పటికీ వన్డేల్లో అత్యధిక స్కోరు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 బంతుల్లో దీప్తి శర్మ ఈ మైలురాయిని సాధించింది.

India's Deepti Sharma slams 188 in ODI game, records tumble against Ireland

188 పరుగుల్లో 27 బౌండరీలు, రెండు సిక్సులు ఉన్నాయి. దీప్తి శర్మకు ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన పూనమ్ రౌత్ 116 బంతుల్లో 109 పరుగులతో సెంచరీ చేసింది. ఈ ఇద్దరి జోడీ 320 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 46వ ఓవర్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.

వన్డేల్లో ఏ వికెట్ కైనా ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. నాలుగు దేశాలు పాల్గొంటున్న భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు పాల్గొంటున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian woman opener Deepti Sharma stormed herself into record books after slamming 188 against Ireland in an ODI match against Ireland on Monday (May 15).
Please Wait while comments are loading...