గాయపడి ఇంటికెళ్లినా పులుపు చావలేదు: స్కార్క్ అక్కసు

Posted By:
Subscribe to Oneindia Telugu

మెల్బోర్న్: గాయపడి ఇంటికి వెళ్లినా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌లో పులుపు చావలేదు. భారత్‌పై ఆక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నాడు. 'స్ట్రెస్ ఫ్రాక్చర్'తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి అతను దూరమయ్యాడు. మూడో టెస్ట్ ఆడలేక ఇంటికెళ్లిపోయాడు.

'ఫాక్స్ స్పోర్ట్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రాంచీ టెస్టు‌లో ఓడిపోతామని, సిరీస్ కోల్పోతామని భారత్ భయపడిందని స్టార్క్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య సూటిపోటి మాటలు, కవ్వింపు చర్యలపై కూడా స్పందించాడు.

India scared of defeat to us, says Australian left-arm pacer Mitchell Starc

తమ జట్టు కన్నా వాళ్లే ఎక్కువ చేశారని ఆడిపోసుకున్నాడు. తొలి మ్యాచులో ఓడిపోవడంతో తమపై భారత ఆటగాళ్లు మాటల యుద్ధానికి దిగారని అన్నాడు టెస్ట్ తొలి రోజు కుడి భుజానికి దెబ్బ తగిలి ఫీల్డ్‌ నుంచి వెళ్లిపోయిన భారత్ కెప్టెన్ కోహ్లీని ఆ తర్వాత ఆసీస్ కెప్టెన్ స్మిత్, ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కవ్వించే విధంగా భుజం పట్టుకుని నటించిన విషయం తెలిసిందే.

ఇద్దరు యువకులు తమ వైపు నుంచి మంచి ప్రదర్శన కనబరిచారని చెప్పాడు. రాంచీలో వారు పోరాడిన తీరు అద్భుతమని అన్నాడు. వారు ఆత్మరక్షణ ధోరణి అవలంబించారని అన్నాడు. తాము తొలి టెస్టు మ్యాచ్ గెలిచామని, సవాల్ చేయడానికి ఇంకా అవకాశం ఉందని అన్నడాు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Australian left-arm pacer Mitchell Starc has said that India were scared of losing the ongoing Border-Gavaskar Trophy after their unexpected loss in Pune and that’s why they started with verbal confrontations with the visitors.
Please Wait while comments are loading...