5 వన్డేలు, ఒక టీ20: విండిస్ పర్యటనకు టీమిండియా ఎంపిక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇంగ్లాండ్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా కరీబియన్‌ దీవుల్లో పర్యటించనుంది. జూన్ 1 నుంచి 18 వరకు ఇంగ్లాండ్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీలో టీమిండియా ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది.

ఈ టోర్నీ ముగిసిన అనంతరం జూన్ 23 నుంచి కరేబియన్ దీవుల్లో భారత జట్టు పర్యటన మొదలవుతుందని బీసీసీఐ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. జూన్‌ 23న ట్రినిడాడ్‌లో జరిగే తొలి వన్డేతో పర్యటన ప్రారంభం అవుతుంది.

India to tour West Indies for 5 ODI, 1 T20I series: Here is the full schedule

ఈ సిరిస్‌లో భాగంగా టీమిండియా ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. తొలి వన్డే జూన్ 23న ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియంలో జరగనుండగా, 25న రెండో వన్డే (ట్రినిడాడ్‌), 30న మూడో వన్డే (ఆంటిగ్వా), జులై 4న నాలుగో వన్డే (ఆంటిగ్వా), 6న ఐదో వన్డే (జమైకా), 9న ఏకైక టీ20 మ్యాచ్‌ (జమైకా)లో జరగనున్నాయి.

వెస్టిండిస్ పర్యటన షెడ్యూల్:

1st ODI - June 23 - Queen's Park Oval (Port of Spain)
2nd ODI - June 25 - Queen's Park Oval (Port of Spain)
3rd ODI - June 30 - Sir Vivian Richards Stadium (Antigua)
4th ODI - July 2 - Sir Vivian Richards Stadium (Antigua)
5th ODI - July 6 - Sabina Park (Jamaica)

One-off T20I - July 9 - Sabina Park (Jamaica)
Channels: Ten Sports, Ten 1

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Team India will embark upon a tour of West Indies after the conclusion of the ICC Champions Trophy in England on June 18.
Please Wait while comments are loading...