రాంచీ టెస్టు, డే 1: స్మిత్‌ 100.. మాక్స్‌వెల్‌ 50, ఆసీస్ 299/4

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీ టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (117 బ్యాటింగ్; 244 బంతుల్లో 13 ఫోర్లు), మ్యాక్స్ వెల్ (82 బ్యాటింగ్; 147 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు.

ఓపెనర్‌ వార్నర్‌ (19) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. నిలకడగా ఆడుతూ ఆడుతూ అందివచ్చిన బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ 99 పరుగుల వద్ద మురళీ విజయ్‌ వేసిన 82.5వ బంతిని లాంగ్‌ ఆన్‌ వైపు బౌండరీకి తరలించి 19వ టెస్టు సెంచరీ సాధించాడు.

మూడో టెస్టు తొలి రోజు కెప్టెన్ స్మిత్, మాక్స్‌వెల్‌ల జోడీ ఐదో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్టీవ్ స్మిత్ ఈ సిరీస్‌లో రెండో సెంచరీ సాధించగా, సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న మాక్స్‌వెల్ అర్ధ సెంచరీని సాధించాడు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2, అశ్విన్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.


తొలిరోజు ఆట సాగిందిలా:

సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్ స్టీవ్ స్మిత్
రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ చేశాడు. 228 బంతులను ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్ 11 ఫోర్ల సాయంతో సెంచరీని నమోదు చేశాడు. డేవిడ్ వార్నర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ఆచితూచి ఆడుతున్నాడు. నిలకడగా ఆడుతూ అందివచ్చిన బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ సెంచరీ చేశాడు. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 19వ టెస్టు సెంచరీ. ఈ సెంచరీతో స్మిత్ మైక్ హస్సీ, మార్క్ టేలర్‌ల 19 టెస్టుల జాబితాలో చేరాడు. దీంతో 86 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ స్టీవ్ స్మిత్ 114, మ్యాక్స్ వెల్ 74 పరుగులతో క్రీజులో ఉన్నారు.

సిక్స్‌తో అర్ధసెంచరీ చేసిన మ్యాక్స్‌వెల్
రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ అర్ధసెంచరీని నమోదు చేశాడు. 47 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ సిక్స్ బాది అర్ధసెంచరీని సాధించడం విశేషం. మ్యాక్స్ వెల్‌కు ఇది తొలి టెస్టు అర్ధసెంచరీ కావడం విశేషం. 74 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ 94, మ్యాక్స్‌వెల్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రాంచీ టెస్టు: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు ఫోటోలు

రాంచీ టెస్టులో పట్టు బిగించిన స్మిత్ సేన
రాంచీలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ సేన నిలకడగా ఆడుతోంది. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డేవిడ్ వార్నర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ఆచితూచి ఆడుతున్నాడు. నిలకడగా ఆడుతూ అందివచ్చిన బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ సెంచరీకి చేరువయ్యాడు. 69 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ 91, మ్యాక్స్ వెల్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టీ విరామానికి ఆస్ట్రేలియా 194/4
రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీ విరామానికి ఆస్ట్రేలియా 60 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 80 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. అతనికి మద్దతుగా మ్యాక్స్‌వెల్ 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 89 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ ప్రధాన ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ (19), రెన్ షా (44), షాన్ మార్ష్ (2)లు పెవిలియన్‌కు చేరారు. ఈ ముగ్గురు తొలి సెషన్‌లోనే అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది.

నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్
రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ స్మిత్ అర్ధసెంచరీ చేసిన వెంటనే ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో హ్యాండ్స్ కోంబ్ ఎల్బీగా వెనుదిరిగాడు. హ్యాండ్స్ కోంబ్ అవుటైన తర్వాత మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. దీంతో 44 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ప్రస్తుతం స్మిత్ 52, మ్యాక్స్ వెల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

స్టీవ్ స్మిత్ అర్ధసెంచరీ: ఆస్ట్రేలియా 139/3
మూడో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అర్ధసెంచరీ చేశాడు. 104 బంతులను ఎదుర్కొన్న స్మిత్ 6 ఫోర్ల సాయంతో అర్ధసెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 21వ అర్ధసెంచరీ. దీంతో 42 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. ప్రస్తుతం స్మిత్ 50, పీటర్ హ్యాండ్స్ కోంబ్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 109/3
రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 34, పీటర్ హ్యాండ్స్ కోంబ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీసుకున్నారు.

89 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్

మూడో టెస్టులో ఆస్ట్రేలియా 89 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. భారత బౌలర్లను సులభంగా ఎదుర్కొంటూ 50 పరుగులు జోడించాడు. ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రెన్ షా 44 పరుగుల వద్ద అవుటైన కొద్ది సేపటికే మార్ష్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆస్ట్రేలియా 28 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది.

రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. 19 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద ఓపెన‌ర్ వార్న‌ర్ అవుట్ కాగా, 44 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద రెన్ షా వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజులో స్మిత్ 19, మార్ష్ 1 ప‌రుగుల‌తో ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 88 (24 ఓవ‌ర్ల‌కి)గా ఉంది. భార‌త బౌల‌ర్ల‌లో ఉమేష్‌, జ‌డేజాల‌కు చెరో వికెట్ ద‌క్కింది. ఈ సిరీస్‌లో ఇరు జ‌ట్లు 1-1 గా స‌మజ్జీవులుగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచులో గెల‌వడం ద్వారా సిరీస్‌లో పై చేయి సాధించాల‌ని ఇరు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి.

డేవిడ్ వార్నర్ అవుట్: తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన ఓవర్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆస్ట్రేలియా 9.4 ఓవర్లకు వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. వార్నర్ అవుటైన తర్వాత క్రీజులోకి కెప్టెన్ స్టీవ్ స్మిత్ వచ్చాడు. ప్రస్తుతం ఓపెనర్ రెన్ షా 29, స్టీవ్ స్మిత్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతోన్న ఆస్ట్రేలియా 36/0
రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వార్నర్ 10, రెన్ షా 24 పరుగులతో ఉన్నారు.

 

భారత్, ఆస్ట్రేలియాల మధ్య రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. జేఎస్‌సీఏ స్టేడియం జరుగుతున్న తొలి టెస్టు ఇదే కావడం విశేషం. అంతేకాదు భారత్‌లో టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న 26 వేదికగా జేఎస్‌సీఏ స్టేడియం నిలిచింది.

నాలుగు టెస్టుల మ్యాచ్‌ల సిరిస్‌లో ఇరు జట్లు ఇప్పటికే చెరో టెస్టు మ్యాచ్ గెలిచాయి. దీంతో సిరిస్ 1-1తో సమమైంది. రాంచీ టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం దక్కించుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇదిలా ఉంటే టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్‌కి ఇది 50వ టెస్టు కాగా ఆస్ట్రేలియాకు ఇది 800వ టెస్టు.

India Vs Australia, 3rd Test: Steve Smith wins the toss, elects tobat first

ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టులో రెండు మార్పులు చేయగా, భారత్ ఒక మార్పు చేసింది. ఆసీస్ జట్టు నుంచి మిచెల్ మార్ష్, స్టార్క్ గాయాలతో దూరం కాగా, వారి స్థానంలో మాక్స్‌వెల్, కమ్మిన్స్‌ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. భారత్‌ మాత్రం ఒక మార్పు చేసింది.

భుజం గాయం నుంచి కోలుకున్న ఓపెనర్‌ మురళీ విజయ్‌ రాంచీ టెస్టు తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. కరుణ్‌ నాయర్‌ స్థానంలో స్పిన్నర్‌ జయంత్‌ యాదవ్‌ జట్టులోకి వస్తారని భావించారు. కానీ జయంత్‌కు స్థానం దక్కలేదు. రాంచీ వికెట్‌ ఎలా స్పందిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ పిచ్‌పై మ్యాచ్‌ ఐదు రోజులు సాగి బ్యాట్‌కు, బంతికి సమాన అవకాశాలు ఉంటాయని క్యూరేటర్‌ ఎల్బీ సింగ్ తెలిపాడు. కానీ, పిచ్‌ నలుపు రంగులో ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ మట్టి పోసి దానిపై రోలింగ్‌ చేసినట్టుందని ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్ వ్యాఖ్యానించాడు.

తొలి రోజు బాగానే ఉండి తర్వాత స్లో, బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బంది ఉంటుందని అన్నాడు. దీనికి భిన్నంగా.. కోహ్లీ మాత్రం ఇంత వేడి వాతావరణంలో రివర్స్‌ స్వింగ్‌ లభిస్తుందని చెప్పడం విశేషం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Australia captain Steve Smith won the second toss of the series and elected to bat first against India in the third Test match here on Thursday (March 16).
Please Wait while comments are loading...