కోహ్లీ సేనకు కఠిన పరీక్ష: గర్వంగా ఉందన్న స్టీవ్ స్మిత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆసీస్ ఆటగాళ్లు పీటర్ హ్యాండ్స్‌కోంబ్, షాన్ మార్ష్‌లను చూసి తాను గర్వపడుతున్నానని కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పాడు. రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ అనంతరం స్మిత్ మీడియాతో మాట్లాడాడు.

మూడో టెస్టు మ్యాచ్ మా చేతి నుంచి కోల్పోకుండా వారిద్దరూ నిలబడిన తీరు చాలా బాగుందని హ్యాండ్స్‌కోంబ్, షాన్ మార్ష్‌‌లు అద్భుతంగా ఆడారని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. రాంచీ టెస్టు డ్రాగా ముగియడంతో నేతృత్వంలోని టీమిండియా తీవ్రంగా గాయపరిచి ఉంటుందని స్మిత్ పేర్కొన్నాడు.

మూడో టెస్టులో చివరి రోజైన సోమవారం ఆసీస్ ఆటగాళ్లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న తీరు అద్భుతమని, దీంతో ఈ టెస్టులో తామే పైచేయి సాధించినట్లుగా స్మిత్ పేర్కొన్నాడు. నాలుగో రోజు ఆట ముగిసే సరికి భారత్ గెలవడం ఖాయమని అందరూ భావించారు.

భారత్‌కు విజయాన్ని

భారత్‌కు విజయాన్ని

భారత్‌కు విజయాన్ని దూరం చేసిన హ్యాండ్స్‌కోంబ్, షాన్ మార్స్‌
కానీ చివరి రోజు ఆసీస్ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్, షాన్ మార్స్‌ల జోడీ క్రీజులో పాతుకుపోయి టీమిండియాకు విజయాన్ని దూరం చేశారు. వీరిద్దరూ 64 ఓవర్లు పాటు క్రీజులో నిలిచి కోహ్లీ సేనకు కఠిన పరీక్ష పెట్టారు. దీంతో మూడో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

ఇదొక అద్భుతమైన టెస్టు.

ఇదొక అద్భుతమైన టెస్టు.

'నిజంగా ఇదొక అద్భుతమైన టెస్టు. ఆసీస్ కుర్రాళ్లు క్రీజులో పాతుకుపోయిన విధానం అద్భుతం. మ్యాక్స్‌వెల్ సెన్సేషనల్. తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఆడిన తీరు అద్భుతం' అని స్మిత్ తెలిపాడు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత రాంచీ టెస్టులో చోటు దక్కించుకున్న ప్యాట్ కమ్మిన్స్పై కూడా స్మిత్ ప్రశంసలు కురిపించాడు.

హ్యాండ్ కోంబ్, షాన్ మార్ష్‌ల పోరాటం అభినందనీయం

హ్యాండ్ కోంబ్, షాన్ మార్ష్‌ల పోరాటం అభినందనీయం

'సుదీర్ఘ విరామం తర్వాత కమ్మిన్స్ తొలి టెస్టు ఇది. చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక టెస్టును డ్రా చేయడంలో హ్యాండ్ కోంబ్, షాన్ మార్ష్‌ల పోరాటం నిజంగా అభినందనీయం. ఆ తరహా పోరాటాన్నే తాము కోరుకుంటున్నాం. అటువంటి పోరాటం కోసం పదే పదే చర్చించుకున్నాం' అని అన్నాడు.

నాకు చాలా గర్వంగా ఉంది

నాకు చాలా గర్వంగా ఉంది

'మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కష్ట సమయంలో ఉన్నప్పుడు మా సుదీర్ఘమైన పోరాటంతో డ్రాగా ముగించాం. ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. ఆఖరి రోజు ఆటలో మమ్మల్ని సులువుగా ఆలౌట్ చేయవచ్చిన భారత్ జట్టు భావించి ఉంటుంది. అలా జరగలేదు. దాంతో ఆ టెస్టులో చివరకు మాదే పైచేయిగా నిలిచింది. ఇదే స్ఫూర్తితో నాలుగో టెస్టుకు సిద్ధమవుతున్నాం' అని స్మిత్ తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Australian skipper Steve Smith on Monday (March 20) said they were a few runs short in the first innings against India in the third cricket Test match here.
Please Wait while comments are loading...