16 మ్యాచ్‌లు, 7 సెంచరీలు: హోం సీజన్‌లో పుజారా ట్రాక్ రికార్డు ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆటగాడు పుజారా బౌండరీ బాది సెంచరీ నమోదు చేశాడు. 218 బంతులను ఎదుర్కొన్న పుజారా 14 ఫోర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో పుజారాకి ఇది 11వ సెంచరీ కావడం విశేషం.

అంతేకాదు ఈ సిరీస్‌లో భారత్ తరపున సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు పుజారానే. మూడో టెస్టులో ఒక వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ పుజారా స్టైలిష్ షాట్లతో అలరించాడు. దీంతో
2016/17 సీజన్‌లో అత్యధిక పరుగులు 1157 చేసిన రెండో భారత క్రికెటర్‌గా పుజారా రికార్డు సాధించాడు.

India vs Australia: Cheteshwar Pujara rises to the occasion with another weighty ton

ఈ సీజన్‌లో తాను ఆడిన 12 మ్యాచ్‌ల్లో పుజారా 64.28 యావరేజితో 1157 పరుగులు చేశాడు. అతని కంటే ముందు కోహ్లీ 1247 (2016/17) పరుగులతో మొదటి స్ధానంలో ఉండగా, ఆ తర్వాత సెహ్వాగ్ 1105 (2004/05), గవాస్కర్ 1027(1979/80) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇక మూడో రోజు టీ విరామ సమయానికి టీమిండియా టీ విరామ స‌మ‌యానికి టీమిండియా నాలుగు వికెట్ల‌కు 303 పరుగులు చేసింది. పుజారా 109, క‌రుణ్ నాయ‌ర్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 148 పరుగుల వెనుకబడి ఉంది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 451 పరుగులు చేసింది.

ఇదిలా ఉంటే 29 ఏళ్ల రాంచీ టెస్టులో సెంచరీ చేయడంతో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌లో తొలిసారిగా టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన స్టేడియాలు ఇండోర్, రాజ్ కోట్, విశాఖపట్నం, రాంచీలలో సెంచరీలు సాధించిన ఆటగాడిగా పుజారా గుర్తింపు పొందాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cheteshwar Pujara may have missed out on a well-deserved hundred in the last match in Bengaluru, but made amends in this match by slamming his 11th Test ton.
Please Wait while comments are loading...