న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2010 తర్వాతే ఆస్ట్రేలియానే: డ్రాగా ముగిసిన రాంచీ టెస్టు

రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. షాన్ మార్ష్ 15, పీటర్ హ్యాండ్స్ కోంబ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

By Nageshwara Rao

హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన చేసింది. విజయం ఖాయ‌మ‌నుకున్న టీమిండియా ఆశ‌లపై నీళ్లు చ‌ల్లింది. చివరిరోజు స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఆసీస్ ఆటగాళ్లు షాన్ మార్ష్, పీట‌ర్ హ్యాండ్స్‌ కోంబ్ అద్భుత ప్రదర్శన చేశారు.

చివరిరోజు 62 ఓవ‌ర్ల పాటు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో మూడో టెస్టు డ్రాగా ముగిసింది. 63 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి ఓట‌మి అంచులో ఉన్న ఆస్ట్రేలియాను ఈ ఇద్దరూ ఆదుకున్నారు. వీరిద్దరి జోడీ ఐదో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

రెండు సెష‌న్ల పాటు ఈ ఇద్ద‌రూ వికెట్ ఇవ్వ‌కుండా భార‌త బౌల‌ర్ల స‌హనాన్ని ప‌రీక్షించారు. టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఈ జోడీని విడదీసేందుకు తెగ కష్టపడ్డారు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లకు 204 పరుగులు చేసింది.

ఆసీస్ ఆటగాడు పీటర్ హ్యాండ్స్ కోంబ్ 72 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. 2010 తర్వాత భారత గడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌లో టెస్టుని డ్రా చేసుకున్న విదేశీ జట్టు ఆస్ట్రేలియానే కావడం విశేషం.

ఈ సిరీస్‌లో చివరి టెస్టు ఈ నెల 25న ధర్మశాలలో ప్రారంభం కానుంది. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా నాలుగు, అశ్విన్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు. డబుల్ సెంచరీ చేసిన పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

స్కోరు వివరాలు:
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ 451
భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 603/9
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 204/6

ఫలితం: మ్యాచ్ డ్రా


చివరి రోజు ఆసీస్ ఆటతీరు సాగిందిలా:

ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్: చివర్లో చిగురించిన భారత్ ఆశలు
మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. మార్ష్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌‌ను 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. చివరి వరకు వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడుతున్న ఆస్ట్రేలియా వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో భారత ఆటగాళ్లతో పాటు అభిమానుల్లో ఆశలు చిగురించాయి. . ప్రస్తుతం 97 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. హ్యాండ్స్‌ కోంబ్ 68, మ్యాథ్యూ వేడ్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్‌లో ఫలితం తేలడం దాదాపు అసాధ్యమని అనిపిస్తోంది.

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్

మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఐదో వికెట్ వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 187 పరుగుల వద్ద ఉన్నప్పుడు రవీంద్ర జడేజా బౌలింగ్‌లో షాన్ మార్ష్ (53) మురళీ విజయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 93 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. హ్యాండ్స్ కోంబ్ 66, మ్యాక్స్ వెల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కంగూరూలు కోల్పోయిన ఐదు వికెట్లలో నాలుగు జడేజా తీసినవే కావడం గమనార్హం

షాన్ మార్ష్‌ అర్ధసెంచరీ

కానీ చివరి రోజు ఆటలో ఆసీస్‌ ఆటగాళ్లు షాన్ మార్ష్- పీటర్ హ్యాండ్స్‌ కోంబ్‌లు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధసెంచరీలు నమోదు చేశారు. చివరి రోజు ఆట తొలి సెషన్‌ చివర్లో వచ్చిన ఈ ఇద్దరూ చివరి సెషన్‌లో అర్ధ సెంచరీలు నమోదు చేసి ఆసీస్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు.

సోమవారం 23/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ లంచ్‌ విరామానికి ముందు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌, రెన్‌ షా వికెట్లు కోల్పోయింది. దీంతో మూడో టెస్టులో భారత్ విజయం సాధిస్తుందని అనుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వీరు క్రీజులో పాతుకుపోయారు.

నెమ్మదిగా ఆడుతూ పరుగులు రాబడుతూ రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. దీంతో రాంచీ టెస్టును డ్రాగా ముగించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఈ దిశగానే అడుగులు వేస్తోంది. ఈ ఇద్దరి జోడీ ఐదో వికెట్‌కు 100కు పైగా పరుగులు జోడించారు.

87వ ఓవర్లో ఐదో బంతిని ఫోర్‌గా మలిచిన మార్ష్‌ అర్ధసెంచరీని సాధించాడు. టెస్టుల్లో మార్ష్‌కి ఇది ఏడో అర్ధసెంచరీ. 87 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ప్రస్తుతం మార్ష్‌ 52, హ్యాండ్స్‌ కోంబ్ 60 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ 28 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఆధిక్యంలో ఆస్ట్రేలియా
రాంచీ వేదికగా భారత్‌‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు ఆధిక్యం లభించింది. 80 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌కు 18 పరుగుల ఆధిక్యం లభించింది. మూడో టెస్టులో భారత్ విజయానికి ఆసీస్ ఆటగాళ్లు షాన్ మార్ష్‌-హ్యాండ్స్‌ కోంబ్‌ల జోడీ అడ్డుగోడలా నిలిచింది. నాలుగో రోజు టీమిండియా ఆటను చూస్తే ఈ టెస్టులో తప్పక విజయం సాధిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావించారు. కానీ చివరి రోజు ఆటలో ఆసీస్‌ ఆటగాళ్లు నిలబడి, తడబడకుండా ఆడుతున్నారు. అంతేకాదు రాంచీ టెస్టుని డ్రా దిశగా నడిపిస్తున్నారు.

అర్ధసెంచరీ చేసిన పీటర్ హ్యాండ్స్ కోంబ్
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఆటగాడు పీటర్ హ్యాండ్స్ కోంబ్ అర్ధసెంచరీని నమోదు చేశాడు. 126 బంతులను ఎదుర్కొన్న పీటర్ హ్యాండ్స్ కోంబ్ ఆరు ఫోర్ల సాయంతో అర్ధసెంచరీని సాధించాడు. టెస్టుల్లో పీటర్ హ్యాండ్స్ కోంబ్‌కు ఇది మూడో అర్ధసెంచరీ. మరో ఆటగాడు షాన్ మార్ష్ కూడా అర్ధసెంచరీకి చేరువలో ఉన్నాడు. 78 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ప్రస్తుతం హ్యాండ్స్ కోంబ్ 56, షాన్ మార్ష్ 46 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రాంచీ టెస్టులో అనుకోని అతిథి
రాంచీ టెస్టుకు అనుకోని అతిథి వచ్చారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాజరయ్యారు.

డ్రా దిశగా రాంచీ టెస్టు
రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఆసీస్ 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్ కోంబ్ అద్భుతంగా ఆడుతూ టెస్టుని డ్రా దిశగా నడిపిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి నుంచి గట్టెక్కేలా కనిపిస్తోంది. టీ విరామానికి ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఇంకా 3 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం మార్ష్ 38, హ్యాండ్స్ కోంంబ్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. ఇంకా ఒక్క సెషన్ ఆట మాత్రమే మిగిలి ఉంది.

32 బంతులకు ఒకే ఒక్క పరుగు

మూడో టెస్టులో భారత విజయానికి ఆసీస్‌ ఆటగాళ్లు మార్ష్‌-హ్యాండ్స్‌ కోంబ్ అడ్డుగోడగా నిలిచారు. చివరి రోజు కావడంతో టెస్టును డ్రా చేసేందుకు గాను 54వ ఓవర్‌ చివరి బంతికి ముందు వరుక ఆడిన 32 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయలేదు. ఆ తర్వాత ఇద్దరూ కాస్త దూకుడుగా ఆడటం ప్రారంభించారు. అశ్విన్‌ వేసిన 57వ ఓవర్లో హ్యాండ్స్‌ కోంబ్ మూడు ఫోర్లు కొట్టి ఏకంగా 14 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 64 పరుగులు జోడించారు. ఆసీస్‌ ఇంకా 25 పరుగుల వెనుకంజలో ఉంది. 57 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్ష్‌ 35, హ్యాండ్స్‌ కోంబ్ 29 పరుగులతో ఉన్నారు

నిలకడగా ఆడుతోన్న మార్ష్-హాండ్స్ కోంబ్

మూడో టెస్టులో ఆసీస్‌ ఆటగాళ్లు మార్ష్‌-హ్యాండ్స్‌ జోడీ క్రీజులో పాతుకుపోయారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి ఇప్పటివరకు అజేయంగా 45పరుగులు చేసింది. వికెట్‌ కోల్పోకుండా మ్యాచ్‌ను ఎలాగైనా డ్రా చేయాలని ఆడుతున్నారు. 50 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్ష్‌ 28, హ్యాండ్స్‌ కోంబ్ 13 పరుగులతో ఉన్నారు. ఆసీస్‌ ఇంకా 44 పరుగులు వెనుకంజలో ఉంది. మరోవైపు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా స్టార్ బౌలర్ అశ్విన్ ఘోరంగా విఫలమయ్యాడు. చివరి రోజు ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు.

రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. షాన్ మార్ష్ 15, పీటర్ హ్యాండ్స్ కోంబ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఇంకా 69 పరుగుల వెనుకంజలో ఉంది. ఆసీస్ చేతిలో 6 వికెట్లు ఉన్నాయి.

రాంచీ టెస్టులో నమోదైన రికార్డులివే (ఫోటోలు)రాంచీ టెస్టులో నమోదైన రికార్డులివే (ఫోటోలు)

జడేజాకు చిక్కిన స్మిత్‌

మూడో టెస్టులో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో జడేజా వేసిన తొలి బంతిని ఎదుర్కొనే క్రమంలో కెప్టెన్ స్మిత్‌ (21) బౌల్డ్ అయ్యాడు. స్మిత్‌ అవుటవ్వడంతో టీమిండియాలో ఆనందం వెల్లివెరిసింది. దీంతో 32 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 65పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్ష్‌(6), హ్యాండ్స్‌కాంబ్‌ ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ఇంకా 87పరుగుల వెనుకంజలో ఉంది.

రెన్‌ షాపై కోపడ్డ ఇషాంత్‌ శర్మ

మూడో టెస్టులో ఆసీస్‌ మూడో వికెట్ కోల్పోయింది. ఇషాంత్‌ బౌలింగ్‌లో రెన్‌ షా ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో 29వ ఓవర్లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. 29వ ఓవర్లో తొలి బంతి వేసేందుకు ఇషాంత్‌ రాగా చివరి క్షణంలో రెన్‌ షా క్రీజు నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇషాంత్‌కు కోపం రావడంతో చేతిలోని బంతిని వికెట్లకు సమీపంలో విసిరాడు. దీన్ని చూసిన రెన్‌షా నవ్వూతూ కనిపించాడు. ఈ క్రమంలో అంపైర్‌... కెప్టెన్ కోహ్లీని పిలిచి మాట్లాడాడు. ఆ తర్వాతి వేసిన ఇషాంత్‌ వేసిన రెండు బంతుల్ని ఎదుర్కొన్న రెన్‌ షా నాలుగో బంతికి ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.

నిలకడగా ఆడుతోన్న ఆస్ట్రేలియా

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో చివరి రోజు ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 23/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ టెస్టును డ్రాగా ముగించాలని చూస్తోంది. ఇందులో భాగంగా వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతోంది. 25 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్మిత్‌ 20, రెన్‌ షా 15 పరుగులతో ఉన్నారు. ఆసీస్‌ ఇంకా 98 పరుగుల వెనుకంజలో ఉంది.

మరోవైపు ఈ టెస్టులో గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని ప్రదర్శించాలని భారత్‌ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 451 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 603 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. పుజారా డబుల్ సెంచరీ చేయగా, సాహా సెంచరీతో రాణించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X