అదెలా?: తొలి టెస్టు గెలిస్తే టీమిండియాకు ఆరున్న‌ర కోట్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో భాగంగా ఫిబ్రవరి 23న పూణెలో తొలి టెస్టు ఆరంభం కానుంది. అయితే ఆసీస్‌తో జరగనున్న తొలి టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే జట్టు ఖాతాలో ఆరున్న‌ర కోట్లు జ‌మ‌వుతాయి.

కేవలం ఒక్క టెస్టు గెలిస్తే ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము జమ అవుతుందా? అంటే నిజమే. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతుంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టును గెలిస్తే ఈ సీజన్‌లో కోహ్లీ సేన తన నెంబర్ వన్ ర్యాంకుని నిలబెట్టుకుంటుంది.

ప్ర‌తి ఏడాది టెస్టుల్లో నంబ‌ర్ వ‌న్‌గా నిలిచిన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఓ గ‌ద‌తోపాటు ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీని బహమతిగా ఇస్తుంది. దీనికి ఏప్రిల్ 1 క‌టాఫ్ డేట్‌. ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో గెలిస్తే ఆ క‌టాఫ్ స‌మ‌యానికి టీమిండియానే నంబ‌ర్‌వ‌న్‌గా ఉంటుంది.

టీమిండియాకు ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ

టీమిండియాకు ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ

తద్వారా టీమిండియాకు ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ దక్కుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టెస్టు ర్యాంకుల్లో రెండో స్ధానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు కూడా ప్రైజ్ మనీపై కన్నేసింది. అయితే ఆసీస్‌కు ప్రైజ్ మనీ దక్కాలంటే భారత పర్యటనలో సిరస్‌ను 3-0తో గెల‌వాల్సి ఉంటుంది.

అద్భుతమైన ఫామ్‌లో టీమిండియా

అద్భుతమైన ఫామ్‌లో టీమిండియా

ప్రస్తుతం టీమిండియా ఫామ్‌ను చూస్తుంటే ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా 19 టెస్టుల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక స్వదేశంలో గ‌త 20 టెస్టులుగా టీమిండియా ఓటమినే చవిచూడలేదు.

ఆస్ట్రేలియా 3-0తో గెలవడం అనేది అసాధ్యం

ఆస్ట్రేలియా 3-0తో గెలవడం అనేది అసాధ్యం

కోహ్లీ కూడా వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా 3-0తో గెలవడం అనేది అసాధ్యం. మరోవైపు ఆస్ట్రేలియాకు ఉప‌ఖండంలో మంచి రికార్డు లేదు.

శ్రీలంక పర్యటనలో 0-3తో ఓటమి

శ్రీలంక పర్యటనలో 0-3తో ఓటమి

ఇటీవలే శ్రీలంక పర్యటనను పూర్తి చేసుకున్న ఆస్ట్రేలియా 0-3తో టెస్టు సిరీస్‌ను ఘోరంగా ఓడిపోయింది. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో కూడా 2-1తో ఓటమి పాలైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian cricket team will be awarded a million dollars by the International Cricket Council (ICC) if they win the first Test against visitors Australia, to be played in Pune from February 23. The big cash reward will be given to the team as prize money for retaining the number one ICC Ranking in Tests.
Please Wait while comments are loading...