రాంచీ టెస్టు: కెప్టెన్లతో మాట్లాడిన కొత్త మ్యాచ్‌ రిఫరీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో భాగంగా చివరి రెండు టెస్టులకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా ఎంపికైన రిచీ రిచర్డ్‌సన్‌ రాంచీ టెస్టుకు ముందు భారత్, ఆస్ట్రేలియా జట్ల కెప్టెన్లతో సమావేశమయ్యాడు.

దీంతో డీఆర్ఎస్ వివాదంతో భారత్, ఆస్ట్రేలియాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేందుకు తొలిఅడుగు పడింది. బెంగుళూరు టెస్టులో తలెత్తిన డీఆర్ఎస్ వివాదం వల్ల ఇరు జట్ల మధ్య వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే.

రాంచీ టెస్టు: స్టీవ్ స్మిత్ అర్ధసెంచరీ, 4 వికెట్ కోల్పోయిన ఆసీస్

ఈ నేపథ్యంలో ఐసీసీ పేర్కొన్న విధంగా ఇరు జట్ల కెప్టెన్లతో ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ బుధవారం వేరు వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టెస్టు మ్యాచ్‌కి సంబంధించిన నిబంధనలు, ఇతర అంశాలను వారికి క్లుప్తంగా వివరించాడు.

India Vs Australia: Match Referee Richardson speaks to Kohli and Smith before Ranchi Test

అయితే ఇదంతా సిరీస్ ప్రారంభానికి ముందు జరిగిన సమావేశం లాగే జరిగినట్లు బీసీసీఐ విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చివరి రెండు టెస్టులకు కొత్త మ్యాచ్ రిఫరీ ఎంపికైన నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లతో ఆయన సమావేశమైనట్లు బీసీసీఐ తెలిపింది.

రాంచీ టెస్టు: 119 ఏళ్ల ఆసీస్ రికార్డుని బద్దలు కొట్టిన రెన్ షా

డీఆర్‌ఎస్‌ వివాదానికి సమస్యకు పరిష్కారం కనుగోనే క్రమంలో మూడో టెస్టుకు ముందు మ్యాచ్‌ రిఫరీ ఇరు జట్ల కెప్టెన్లతో సమావేశమవుతాడని ఐసీసీ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుత మ్యాచ్ రిఫరీగా ఉన్న రిచీ రిచర్డ్‌సన్‌ గతంలో వెస్టిండిస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

మ్యాచ్ రిఫరీతో భేటీ ముగిసిన అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మీడియాతో మాట్లాడాడు. ఈ సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌కు, స్పిన్నర్లకు మధ్య పోటీ ఉందని స్మిత్ చెప్పాడు. మా బ్యాట్స్‌మెన్ భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటుంటే మరోవైపు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ మాత్రం మా స్పిన్ బౌలింగ్‌ను ఆడటంలో సతమతమవుతున్నారని అన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ICC match referee Richie Richardson, appointed for the last two Test matches, on Wednesday (March 15) met rival captains Virat Kohli and Steve Smith separately to douse the simmering tension ahead of the third Test, starting on Thursday (March 16).
Please Wait while comments are loading...