రాంచీ టెస్టుకు స్పెషల్ గెస్ట్‌గా ధోని

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు వీక్షించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చివరి రోజు స్టేడియానికి వచ్చాడు. దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

రాంచీ టెస్టు: కోహ్లీని ఎగతాళి చేసిన ఆసీస్ ఆటగాళ్లకు చురకలు

ధోని నేతృత్వంలోని జార్ఖండ్ జట్టుని టోర్నీలో సెమీస్ వరకు తీసుకెళ్లాడు. అయితే సెమీస్‌లో బెంగాల్ చేతిలో జార్ఖండ్‌ ఓటమి పాలైంది. దీంతో ధోని తన సొంతారు జార్ఖండ్‌కు తిరిగొచ్చాడు. కాగా, సోమవారం భారత్, ఆసీస్‌‌ల మధ్య చివరి రోజు కావడంతో ధోని స్టేడియానికి వచ్చాడు.

India vs Australia: MS Dhoni pays a visit on final day of third Test at Ranchi

స్టేడియంలోని స్పెషల్ గ్యాలరీలో కూర్చొని ధోని మ్యాచ్ చూశాడు. ఈ సందర్భంగా గ్యాలరీలోని ధోనిని కెమెరాలు చూపించగానే అభిమానులు పెద్దఎత్తున 'ధోని ధోని' అంటూ నినాదాలు చేశారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు జరుగుతున్న రాంచీలోని జేఎస్‌సీఏ క్రికెట్ మైదానం ధోని సొంత మైదానమన్న సంగతి తెలిసిందే.

వేలెత్తాడు: తల గోక్కుని భలేగా కవర్‌ చేసేశాడు (వీడియో)

2014లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత కొన్నాళ్లు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా వ్యవహారించాడు. ఈ ఏడాది దానికి కూడా వీడ్కోలు పలికి ప్రస్తుతం టీమిండియా జట్టు సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ధోని ఆడనున్నాడు.

ఇదిలా ఉంటే రాంచీలో జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. భారత్ విజయానికి ఆసీస్ ఆటగాళ్లు షాన్ మార్ష్‌-హ్యాండ్స్‌ కోంబ్‌ల జోడీ అడ్డుగోడలా నిలిచింది. నాలుగో రోజు టీమిండియా ఆటను చూస్తే ఈ టెస్టులో తప్పక విజయం సాధిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావించారు.

కానీ చివరి రోజు ఆటలో ఆసీస్‌ ఆటగాళ్లు షాన్ మార్ష్- పీటర్ హ్యాండ్స్‌ కోంబ్‌లు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధసెంచరీలు నమోదు చేశారు. చివరి రోజు ఆట తొలి సెషన్‌ చివర్లో వచ్చిన ఈ ఇద్దరూ చివరి సెషన్‌లో అర్ధ సెంచరీలు నమోదు చేసి ఆసీస్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు.

సోమవారం 23/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ లంచ్‌ విరామానికి ముందు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌, రెన్‌ షా వికెట్లు కోల్పోయింది. దీంతో మూడో టెస్టులో భారత్ విజయం సాధిస్తుందని అనుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వీరు క్రీజులో పాతుకుపోయారు.

నెమ్మదిగా ఆడుతూ పరుగులు రాబడుతూ రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. దీంతో రాంచీ టెస్టును డ్రాగా ముగించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఈ దిశగానే అడుగులు వేస్తోంది. ఈ ఇద్దరి జోడీ ఐదో వికెట్‌కు 100కు పైగా పరుగులు జోడించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The match is being held at Ranchi, Dhoni’s home ground. He was recently leading Jharkhand in the Vijay Hazare Trophy. However, Jharkhand’s challenge ended when they were beaten by Bengal in the semi finals which means that Dhoni will be seen playing next only in the IPL as part of the Rising Pune Supergiants.
Please Wait while comments are loading...