స్టార్క్ లేకపోవడం వల్లే ఆఫ్ స్పిన్నర్లు పూర్ షో: గంగూలీ

Posted By:
Subscribe to Oneindia Telugu

దరాబాద్: ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ రాంచీ టెస్టుకు దూరమవడం వల్లే రాంచీ టెస్టులో ఇరు జట్ల ఆఫ్ స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోయారని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించారు.

గంట ముందు వికెట్ పడి ఉంటే: రాంచీ టెస్టు ఫలితం మరోలా!

India Vs Australia: Starc's absence resulted in off-spinners poorshow in 3rd Test, says Ganguly

'స్టార్క్‌ లేకపోవడం వల్లే ఆఫ్‌స్పిన్నర్లు ఇక్కడ వికెట్లు తీయలేకపోయారు. అతను ఉంటే ఆఫ్‌ స్టంప్‌కు దగ్గర్లో ఉన్న ప్రదేశాన్ని గరుకుగా, పొడిగా మార్చేవాడు' అని గంగూలీ అన్నాడు. కాగా రాంచీ టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ అశ్విన్‌తో పాటు ఆసీస్ స్పిన్నర్ లియాన్ కూడా ప్రభావం చూపలేకపోయారు.

రాంచీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ 64 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా ఆఫ్‌ స్పిన్నర్‌ లియాన్ సైతం ఒక వికెట్‌ మాత్రమే తీసుకున్నాడు. కాలుకి గాయం అవడంతో మిచెల్ స్టార్క్ చివరి రెండు టెస్టులకు స్టార్క్ దూరమైన సంగతి తెలిసిందే.

రాంచీ టెస్టు: ఆవేశంతో ఊగిపోయిన ఇషాంత్, ఆ ఓవర్‌లో ఏం జరిగింది?

'బెంగుళూరులో జరిగిన రెండో టెస్టులో స్టార్క్ కుడి కాలికి గాయమైంది. ఆ టెస్టు మ్యాచ్ లో స్టార్క్ కుడి కాలు స్వల్పంగా చిట్లడంతో విపరీతమైన బాధతో సతమతమయ్యాడు. అతని కాలుకు తీయించిన స్కానింగ్ లో కొద్దిపాటి పగులు వచ్చినట్లు తేలింది. దాంతో అతను స్వదేశానికి వెళ్లక తప్పడం లేదు. అతడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. స్టార్క్ జట్టుకు దూరం కావడం నిజంగా మా దురదృష్టం. టెస్టు సిరీస్ కు స్టార్క్ పూర్తిగా అందుబాటులో ఉంటాడని తొలుత భావించినా అలా జరగలేదు.' అని ఆసీస్‌ ఫిజియోథెరపిస్టు డేవిడ్‌ తెలిపారు.

2010 తర్వాతే ఆస్ట్రేలియానే: డ్రాగా ముగిసిన రాంచీ టెస్టు

మరోవైపు ఆస్ట్రేలియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ షాన్‌ మార్ష్‌, హ్యాండ్స్‌ కోంబ్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను డ్రాగా ముగించారని సౌరభ్ గంగూలీ ప్రశంసించాడు. రెండో ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ ఐదో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former India captain Sourav Ganguly feels injured left-arm fast bowler Mitchell Starc's absence in the third cricket Test against Australia played a big role in the pale show of off-spinners from both the sides in the drawn game, here.
Please Wait while comments are loading...