డీఆర్ఎస్: కోహ్లీవి అసంబద్ధ వ్యాఖ్యలన్న స్టీవ్ స్మిత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బెంగుళూరు టెస్టులో డీఆర్‌ఎస్ రివ్యూ అంశంలో ఆస్ట్రేలియా తమను మోసం చేసిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధ వ్యాఖ్యలని ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ అన్నాడు.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం నుంచి రాంచీ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో స్మిత్ మాట్లాడాడు. డీఆర్ఎస్ వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఆసీస్ పదే పదే మోసం చేసిందని అనడం ఎంతమాత్రం సబబు కాదన్నాడు.

India Vs Australia: Steve Smith terms Virat Kohli's claims on DRS row as 'complete rubbish'

'నా ప్రకారం వారి ఆరోపణలు పూర్తిగా తప్పు. ఆట ముగిసిన వెంటనే నేరుగా బయటకొచ్చా. పొరపాటు చేశాను. తప్పు నాదే. అప్పుడు నా మెదడు మొద్దుబారింది' అని స్టీవ్ స్మిత్‌ చెప్పాడు. ఇప్పటివరకు జరిగిన సిరిస్ బాగానే సాగిందని స్మిత్ చెప్పాడు.

నాలుగు టెస్టుల సిరిస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. ఈ సిరిస్‌లో ఇరు జట్లు చెరో టెస్టు గెలవడంతో సిరిస్ 1-1తో సమమైంది. దీంతో మిగతా రెండు టెస్టుల్లో తమ జట్టు సానుకూల దృక్పథంతో ఆడుతుందని స్మిత్ పేర్కొన్నాడు.

ఇక భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు గాయాలు పాలైన విషయాన్ని కూడా స్మిత్ ప్రస్తావించాడు. కొందరు ఆటగాళ్లు గాయాల పాలై వెనుదిరిగిన తమ వైపు నాణ్యమైన క్రికెటర్లకు కొరత లేదని స్మిత్‌ పేర్కొన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Australian skipper Steve Smith on Wednesday (March 15) rejected Virat Kohli's insinuation that he repeatedly cheated while taking DRS calls, saying the claims by his Indian counterpart are "complete rubbish".
Please Wait while comments are loading...