నా కండ బలం చూశావా: విరిగిన బ్యాట్‌పై మ్యాక్సీతో ఉమేశ్ యాదవ్ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైన వెంటనే స్టేడియంలో ఆటగాళ్లు నవ్వులు చిందించారు. 299/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆస్ట్రేలియా రెండో రోజు ఆటను ప్రారంభించింది.

మ్యాచ్‌ ప్రారంభం కాగానే ఉమేశ్‌యాదవ్‌ వేసిన తొలి బంతిని ఎదుర్కోనే క్రమంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ మ్యాక్స్‌వెల్‌ బ్యాట్‌ విరిగిపోయింది. ఉమేశ్ వేసిన తొలి బంతిని మ్యాక్స్‌వెల్ డిఫెన్స్ ఆడబోయాడు. అయితే 140 కి.మీ వేగంతో వచ్చిన ఆ బంతి బ్యాట్ హ్యండిల్ కింద తగిలడంతో బ్యాట్ రెండు ముక్కలయింది.

నా కండ బలం చూశావా

దీంతో మైదానంలోని ఆటగాళ్ల మోహంలో నవ్వులు విరబూశాయి. అదే సమయంలో ఉమేశ్ యాదవ్... మ్యాక్స్‌వెల్ వైపు చూస్తూ నా కండ బలం చూశావా అన్నట్లు సైగలు చేయడం కనిపించింది. ఈ సన్నివేశంతో ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని అభిమానులు కూడా చాలా సేపు నవ్వుకున్నారు.

అరంగేట్రం చేసిన దేశంపైనే మ్యాక్స్‌వెల్ తొలి టెస్టు సెంచరీ

అరంగేట్రం చేసిన దేశంపైనే మ్యాక్స్‌వెల్ తొలి టెస్టు సెంచరీ

ఇదిలా ఉంటే తాను అరంగేట్రం చేసిన దేశంపైనే మ్యాక్స్‌వెల్ టెస్టుల్లో తొలి సెంచరీ చేయడం విశేషం. 2013లో భారత్‌పై హైదరాబాద్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్‌లో మ్యాక్స్‌వెల్ అరంగేట్రం చేశాడు. సుమారు మూడేళ్ల తర్వాత అదే భారత్‌పై టెస్టుల్లో తన తొలి సెంచరీని సాధించాడు.

తన కెరీర్‌లో ఆడుతోన్న నాలుగో టెస్టు

తన కెరీర్‌లో ఆడుతోన్న నాలుగో టెస్టు

మ్యాక్స్‌వెల్ తన కెరీర్‌లో ఆడుతోన్న నాలుగో టెస్టు ఇది. దీనికి ముందు టెస్టుల్లో మ్యాక్స్‌వెల్ అత్యధిక స్కోరు 37గా ఉంది. రెండో టెస్టులో మిచెల్ మార్ష్ గాయపడటంతో అతడి స్ధానంలో మూడో టెస్టు తుది జట్టులో మ్యాక్స్‌వెల్ చోటు దక్కించుకున్నాడు. తనకు అందివచ్చిన అవకాశాన్ని రాంచీ టెస్టులో మ్యాక్స్‌వెల్ వినియోగించుకున్నాడు.

స్మిత్‌తో కలిసి 191 పరుగుల భాగస్వామ్యం

స్మిత్‌తో కలిసి 191 పరుగుల భాగస్వామ్యం

ఇదిలా ఉంటే రాంచీ టెస్టులో ఐదో వికెట్‌కు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి మ్యాక్స్‌వెల్ 191 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 185 బంతులను ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్ 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 104 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. తొలి టెస్టు సెంచరీ సాధించడంతో మ్యాక్స్‌వెల్‌ మైదానంలో ఉద్వేగానికి గురయ్యాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The third Test between India and Australia might not have had the same mimicking and copy of expressions from players but it did have a light moment on the second day in Ranchi. While this series have been one of the entertaining ones, most of it has been on the field.
Please Wait while comments are loading...