రాంచీ టెస్టులో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ: అభిమానుల్లో ఆనందం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో బ్యాటింగ్‌కు దిగేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు. రాంచీ టెస్టు తొలిరోజు ఆటలో కోహ్లీ భుజానికి కోహ్లీ భుజానికి గాయమైంది. దీంతో అతడు విశ్రాంతి నిమిత్తం మైదానం వీడిన సంగతి తెలిసిందే.

దీంతో రెండో రోజు ఆటలో భాగంగా కోహ్లీ డ్రస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఆడుతాడా? లేదా? అనే అనుమానం తలెత్తింది. శుక్రవారం ఉదయం ఆటకు ముందు టీమిండియాతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్న కోహ్లీ ఆటకు మాత్రం దూరమయ్యాడు.

కోహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ రహానె కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు. అయితే మూడో రోజు ఆటలో కోహ్లీ బ్యాటింగ్‌పై సందిగ్ధంగా మారింది. అయితే శనివారం ఉదయం నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టిసు చేసిన కోహ్లీ నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్ధమయ్యాడు.

ఇందులో భాగంగా కోహ్లీ టెస్టు జెర్సీని ధరించి బాక్సులో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో ఏదో బ్యాటింగ్ టిప్స్‌పై మాట్లాడుతున్న వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇక, లంచ్ విరామానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

మూడో టెస్టులో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. తన కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న మురళీ విజయ్ ఓకీఫ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 183 బంతులను ఎదుర్కొన్న విజయ్ పది ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు.

నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ

దీంతో లంచ్ తర్వాత నాలుగో స్ధానంలో కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. మైదానంలోకి విరాట్ కోహ్లీ అడుగుపెట్టగానే 'కోహ్లీ.. కోహ్లీ.. కోహ్లీ' అంటూ అభిమానులు అరిచారు. దీంతో ఆస్ట్రేలియన్లలో బెంగ మొదలైంది. 82 పరుగుల వద్ద మురళీ విజయ్ అవుటైన తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. త రెండు టెస్టుల్లో 0, 13, 12, 15 స్వల్ప స్కోర్లకే కోహ్లీ వెనుదిరిగాడు. దీంతో మూడో టెస్టులో సెంచరీ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.

మళ్లీ నిరాశపర్చిన కోహ్లీ

రాంచీ టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఎన్నో అనుమానాల మధ్య బ్యాటింగ్‌‌కు దిగిన కోహ్లీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఆసీస్ పేసర్ కమ్మిన్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. 23 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 6 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. కొత్త బంతి తీసుకున్న వెంటనే కమ్మిన్స్‌కు బౌలింగ్ ఇచ్చిన స్మిత్.. కోహ్లీని అవుట్ చేయడం విశేషం. మరోవైపు పుజారా ఆకట్టుకుంటున్నాడు. దీంతో 81 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian cricket fans were given a massive boost when the glimpse of Virat Kohli all ready in his white kits and padded up was shown on the TV screens.
Please Wait while comments are loading...