డ్రస్సింగ్‌ రూమ్‌కే పరిమితమైన కోహ్లీ: గాయంపై బీసీసీఐ ఇలా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు జరిగే ఆటలో కోహ్లీ పాల్గొంటాడని ఊహించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. శుక్రవారం కోహ్లీ డ్రస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యాడు. శుక్రవారం ఉదయం టీమిండియాతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్న కోహ్లీ ఆటకు మాత్రం దూరమయ్యాడు.

కోహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ రహానె కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తొలిరోజు భారత ఫిజియో సహాయంతో బయటకు వెళ్లిన కోహ్లీ శుక్రవారం బరిలోకి దిగక పోవడం విశేషం. రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో కెప్టెన్ కోహ్లీ గాయపడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. కోహ్లీ గాయం తీవ్రమైంది కాదని, మిగతా మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండేందుకు తగిన చికిత్స కొనసాగుతోందని అందులో పేర్కొంది. గురువారం సాయంత్రం కోహ్లి భుజానికి స్కానింగ్‌ నిర్వహించారు.

గాయం తీవ్రమైనదేమీ కాదు

ఫలితాలు వచ్చిన అనంతరం అతని గాయం తీవ్రమైనదేమీ కాదని, మెల్లగా కోలుకుంటున్నాడని బీసీసీఐ అందులో పేర్కొంది. అతని భుజానికి చికిత్స నిర్వహిస్తున్నట్లు బోర్డు వైద్య బృందం స్పష్టం చేసింది. రాంచీ టెస్టులో బరిలోకి దిగే విధంగా చికిత్సను కొనసాగిస్తామని వెల్లడించింది.

 రెగ్యులర్‌ స్థానంలో బ్యాటింగ్‌కు దిగొచ్చు

రెగ్యులర్‌ స్థానంలో బ్యాటింగ్‌కు దిగొచ్చు

కోహ్లీకి అయిన గాయం బయటకు కనిపిస్తుంది కాబట్టి నిబంధనల ప్రకారం అతను తన రెగ్యులర్‌ స్థానంలో బ్యాటింగ్‌కు దిగేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు భారత ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ మాట్లాడుతూ గాయం తరువాత కోహ్లీ మైదానంలోకి వచ్చినా, మునుపటి ఉత్సాహంగా లేడని అన్నాడు.

కోహ్లీ భుజానికి గాయం

కోహ్లీ భుజానికి గాయం

ఇన్నింగ్స్ 40వ ఓవర్‌లో బంతిని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు కెప్టెన్ కోహ్లీ భుజానికి గాయమైంది. జడేజా విసిరిన తొలి బంతిని బౌండరీగా తరలించేందుకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్ కోంబ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో మిడాన్ నుంచి బాల్‌ను వెంబండించిన కోహ్లీ బౌండరీ దాటకుండా ఆపేందుకు డైవ్ చేశాడు.

విశ్రాంతి తీసుకోవాలని సూచించిన ఫిజియో

విశ్రాంతి తీసుకోవాలని సూచించిన ఫిజియో

ఆ ప్రయత్నంలో కుడి భుజంపై అతని బరువంతా పడింది. అనంతరం వెంటనే పైకి లేచిన కోహ్లీ తన భుజాన్ని పట్టుకుని ఇబ్బంది పడుతూ కనిపించాడు. వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజియో కోహ్లీకి విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. దీంతో కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India skipper Virat Kohli is recuperating from the shoulder injury he sustained while fielding on the opening day of the third Test against Australia on Thursday (March 16).
Please Wait while comments are loading...