న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫోటోలు: చెన్నై టెస్టులో చరిత్ర సృష్టించిన అలెస్టర్ కుక్

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.

By Nageshwara Rao

చెన్నై: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. చెన్నై టెస్టులో కుక్ 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. చెన్నై టెస్టుకు ముందు కేవలం రెండు పరుగులు దూరంలో నిలిచిన కుక్ ఈ టెస్టులో దానిని అందుకున్నాడు.

తన కెరీర్‌లో 140వ టెస్టు ఆడుతున్న అలెస్టర్ కుక్‌ మొత్తం 252 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో 11 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న పదో బ్యాట్స్‌మెన్‌గా అలెస్టర్ కుక్ గుర్తింపు పొందాడు. ఐదో టెస్టు తొలి రోజైన శుక్రవారం ఆటలో భాగంగా ఉమేశ్ యాదవ్ వేసిన తొలి బంతికి రెండు పరుగులు సాధించడం ద్వారా కుక్‌ రికార్డును అందుకున్నాడు.

టెస్టుల్లో ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్వస్ కల్లిస్, రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర, బ్రియాన్ లారా, చందర్ పాల్, మహిళా జయవర్ధనే, అలెన్ బోర్డర్‌లు మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఇక ఇంగ్లాండ్ తరుపున ఈ ఘనతను సాధించి ఏకైక క్రికెటర్‌గా కుక్ చరిత్ర సాధించాడు.

8వ బ్యాట్స్‌మెన్‌

8వ బ్యాట్స్‌మెన్‌

అంతేకాదు 11వేల పరుగుల మైలురాయిని అత్యంగ వేగంగా అందుకున్న 8వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. చందర్ పాల్, అలెన్ బోర్డర్ ఈ ఘనతను సాధించడానికి మరిన్ని టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే అలెస్టర్ కుక్ 11వేల పరుగుల మైలురాయిని సాధించేందుకు 10 సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది.

13 సంవత్సరాల 199 రోజుల్లో

13 సంవత్సరాల 199 రోజుల్లో

కుక్ తర్వాత కుమార సంగక్కర 13 సంవత్సరాల 199 రోజుల్లో 11వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. బోర్డర్, లారా, సంగక్కర, చందర్ పాల్ తర్వాత 11వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ అలెస్టర్ కుక్. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అలెస్టర్ కుక్ భారత్‌పైనే అరంగేట్రం చేయడం విశేషం.

తొలి టెస్టులోనే సెంచరీ

తొలి టెస్టులోనే సెంచరీ

సరిగ్గా పదేళ్ల క్రితం నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కుక్ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పుడు కుక్ వయసు 21 ఏళ్లు. ఆ టెస్టు మ్యాచ్‌లో కుంబ్లే, హార్భజన్ సింగ్ లాంటి దిగ్గజాల బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కుని తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.

ఇంగ్లాండ్ తరుపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లాడిన రికార్డు

ఇంగ్లాండ్ తరుపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లాడిన రికార్డు

ఇటీవలే ఇంగ్లాండ్ తరుపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లాడిన రికార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. అంతేనా... టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టు తరుపున మ్యాచ్‌లతో పాటు పరుగులు, సెంచరీలు కూడా తన పేరిట నమోదు చేశాడు. ఈ పదేళ్లలో ఎంతోమంది ఇంగ్లాండ్ టెస్టు జట్టులోకి వచ్చారు. వెళ్లారు. కానీ కుక్ మాత్రం ఇంగ్లాండ్ జట్టుకు ఓ మూలస్తంభంలా నిలబడ్డాడు.

దిగ్గజ ఓపెనర్ల రికార్డులను సైతం అధిగమించిన కుక్

దిగ్గజ ఓపెనర్ల రికార్డులను సైతం అధిగమించిన కుక్

ఇంగ్లాండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు (135) ఆడిన ఆటగాడిగా అలెక్ స్టివార్ట్ (133 మ్యాచ్‌లు) రికార్డును ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్ పర్యటనలో కుక్ అధిగమించాడు. దీంతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో గూచ్, అథర్టన్ లాంటి ఎంతో మంది దిగ్గజ ఓపెనర్ల రికార్డులను సైతం కుక్ అధిగమించాడు.

టెస్టుల్లో 11వేల పరుగుల క్లబ్‌లో చేరిన ఆటగాళ్లు:

Player Team Runs Average
Sachin Tendulkar India 15,921 53.78
Ricky Ponting Australia 13,378 51.85
Jacques Kallis South Africa 13,289 55.37
Rahul Dravid India 13,288 52.31
Kumar Sangakkara Sri Lanka 12,400 57.4
Brian Lara West Indies 11,953 52.88
Shivnarine Chanderpaul West Indies 11,867 51.37
Mahela Jayawardene Sri Lanka 11,814 49.84
Allan Border Australia 11,174 50.56
Alastair Cook England 11,000 46.75
Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X