న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

500వ టెస్ట్‌: చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన, కివీస్‌పై ఘన విజయం

By Nageshwara Rao

కాన్పూర్: కాన్పూర్‌లో జరిగిన చారిత్రాత్మక 500వ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 197 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 236 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ చేశారు. టెస్టుల్లో టీమిండియాకు ఇది 130వ విజయం.

న్యూజిలాండ్‌పై టెస్టుల్లో భారత్‌కు ఇది 19వ టెస్ట్ మ్యాచ్ విజయం. గెలిచే అవకాశాలు నామమాత్రంగా ఉన్న ఈ మ్యాచ్‌లో డ్రాతో గట్టెక్కాలని చూస్తున్న న్యూజిలాండ్ ఆటగాళ్లకు టీమిండియా బౌలర్లు షాక్ ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్లు అదరగొట్టారు.

India Vs New Zealand, Kanpur Test, Day 5: Kiwis start with positive intent

434 పరుగుల లక్ష్యంలో భాగంగా 93/4 ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజైన సోమవారం బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 236 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసుకోగా, షమీ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసుకున్నారు. ఇక మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 30 నుంచి కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

500వ టెస్టులో భారత్:
తొలి ఇన్నింగ్స్‌ 318 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్ 377/5 డిక్లేర్

న్యూజిలాండ్:
తొలి ఇన్నింగ్స్ 262 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్ 236 ఆలౌట్

మ్యాచ్ ఫలితం: 197 పరుగుల తేడాతో భారత్ విజయం

ఐదో రోజు ఆట సాగిందిలా:

టెస్టుల్లో 19వ సారి అశ్విన్‌కు 5 వికెట్లు

కాన్పూర్ టెస్టులో న్యూజిలాండ్ 9వ వికెట్‌ను కోల్పోయింది. 132 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసిన అశ్విన్ చారిత్రాత్మక 500వ టెస్ట్ మ్యాచ్‌లో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు.

లంచ్ బ్రేక్‌కి న్యూజిలాండ్ స్కోరు 205/7

లంచ్ విరామ సమయానికి న్యూజిలాండ్ స్కోరు 205/7. చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్‌లో కివీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే 229 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా మూడు వికెట్లు మాత్రమే మిగిలి ఉండటంతో భారత్‌ విజయం ఖాయమని తెలుస్తోంది.

రెండు వరుస బంతుల్లో షమీకి రెండు వికెట్లు

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వాట్లింగ్(18), క్రెయిగ్(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. ఈ రెండు వికెట్లు కూడా షమీ దక్కించుకోవడం విశేషం. 68వ ఓవర్ ఆఖరిబంతికి వాట్లింగ్ ను బోల్తా కొట్టించిన షమీ, 70వ ఓవర్ తొలి బంతికి క్రెయిగ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లను కోల్పోయింది.

ఐదో వికెట్ కోల్పోయిన కివీస్

434 పరుగుల లక్ష్యంలో భాగంగా 93/4 ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 158 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభం నుంచికూడా భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించిన కివీస్ బ్యాట్స్‌మెన్ లూక్‌ రోంచి 80 పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో అశ్విన్‌కు సునాయాస క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శాంట్నర్‌తో కలిసి ఐదో వికెట్‌కి శతక భాగస్వామ్యం నెలకొల్పిన రోంచి భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. 120 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 80 పరుగులు చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 60 ఓవర్లలో 170 పరుగులు కాగా, ఆ జట్టు చేతిలో మరో 5 వికెట్లు ఉన్నాయి.

అయితే జడేజా వేసిన అద్భుతమైన బంతితో రోంచిని ఔట్ చేసి చారిత్రాత్మక మ్యాచ్‌లో భారత్ విజయానికి బాటలు వేశాడు. న్యూజిలాండ్ జట్టు విజయానికి ఇంకా 264 పరుగులు చేయాల్సి వుంది. భారత్ ఆడుతున్న 500వ టెస్టులో విజయం సాధించాలంటే, మరో 5 వికెట్లను తీయాల్సి ఉంది.

కాగా, నాలుగో రోజు 434 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ను ఆరంభించిన కివీస్ ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. అద్భుతాలు జరిగితే తప్ప న్యూజిలాండ్ గెలవడం సాధ్యం కాదు. విలియమ్సన్ సహా ప్రధాన ఆటగాళ్లను భారత బౌలర్లు పెవిలియన్ పంపడంతో టీమిండియా విజయం లాంఛనంగా మారింది.

ఓపెనర్లు గప్తిల్(0), లాథమ్(2), విలియమ్సన్(25), రాస్ టేలర్(17) వికెట్లను స్పిన్నర్లు నేలకూల్చారు. మొత్తం నాలుగు వికెట్లలో మూడింటిని అశ్విన్ నేలకూల్చి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నాలుగో రోజు 159/1తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 377/5 వద్ద డిక్లేర్ చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

భారత్ బ్యాట్స్‌మెన్లలో రోహిత్‌శర్మ(68), రవీంద్ర జడేజా(50) మెరుపులు మెరిపించి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలకపాత్ర పోషించారు. ఆరు వికెట్లు చేతిలో ఉన్న కివీస్, విజయం కోసం ఇంకా 341 పరుగులు చేయాల్సి ఉంది. కివీస్ ఓటమి దాదాపు ఖాయమైంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X