అదే చెత్త రికార్డు: పాక్‌తో ఫైనల్, నిరాశపరిచిన కెప్టెన్ కోహ్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారత జట్టుకి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు చేయడంతో పాటు అనేక మ్యాచ్‌ల్లో అద్భుత ఇన్నింగ్స్ అడాడు. తన ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలనందించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు | స్కోరు కార్డు

మూడు ఫార్మెట్లలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టుకు వరుస విజయాలను అందించాడు. అంతేకాదు టెస్టుల్లో టీమిండియాను నెంబర్ వన్‌‌గా నిలిపాడు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీపై ఓ మచ్చ కూడా ఉంది. అదేటంటే కీలకమైన ఫైనల్‌ మ్యాచుల్లో ఆడకపోవడం.

Virat Kohli Gone, India in Dire Straits

ఐసీసీ నిర్వహించిన టోర్నీల్లో ఇప్పటివరకు కోహ్లీ ఎనిమిది పైనల్ మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఒక్క ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లీ సెంచరీగానీ, అర్ధసెంచరీగానీ చేయలేదు. ఈ ఎనిమిది ఫైనల్‌ మ్యాచుల్లోనూ కోహ్లీ బ్యాటింగ్‌ సగటు 22గా నమోదైంది.

లండన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో కూడా కోహ్లీ చేతులెత్తేశాడు. పాక్ పేసర్ మహ్మద్ ఆమీర్ బౌలింగ్‌లో మొదట స్లిప్‌లో క్యాచ్‌ మిస్‌ అయి లైఫ్‌ దొరికినప్పటికీ దానిని కోహ్లీ సద్వినియోగం చేసుకోలేదు. ఆ వెంటనే ఆమిర్‌ బౌలింగ్‌లోనే కోహ్లీ పెవిలియన్‌ బాట పట్టడం విశేషం.

ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. ఓపెనర్ రోహిత్‌ శర్మ పాక్‌ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో బంతికి వికెట్ల ముందు దొరికి పోయాడు. దీంతో టీమిండియా తొలి ఓవర్ ముగిసే సరికి వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీని ఆమిర్ మూడో ఓవర్ నాలుగో బంతికి అవుట్ చేశాడు. ఫైనల్లో విరాట్ కోహ్లీ అభిమానులను నిరాశపరచడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian contingent in the stands have completely gone silent after Rohit's early departure. But there are many big hitters in the Indian batting line-up who can take put up a good fight.
Please Wait while comments are loading...