భారత్ Vs పాక్ మ్యాచ్: భువీ, హసన్ అలీ... బెస్ట్ బౌలర్ ఎవరు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆదివారం టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో మధ్యాహ్నాం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

2007 వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత మళ్లీ భారత్-పాక్ జట్లు టైటిల్ పోరులో తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్రికెట్ అభిమానులు తమ తమ పనులను ఇప్పటికే చక్కబెట్టుకుని ఆ అద్భుత క్ష‌ణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇరు దేశాల్లో కూడా క్రికెట్ ఫీవర్ వచ్చేసింది.

India vs Pakistan Final, Champions Trophy 2017: Hasan Living A 'Dream'

ఈ హైటెన్షన్ మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీ అభిమానుల కోసం తన ట్విట్టర్ ఖాతాలో విశేషాలను ఎప్పటికప్పుడు అందిస్తోంది. తాజాగా టీమిండియాకు చెందిన భువనేశ్వర్ కుమార్, పాక్‌కు చెందిన హసన్ అలీలలో బెస్ట్ బౌలర్ ఎవరనే ప్రశ్న వేసింది. పాకిస్థాన్ బౌల‌ర్ హ‌స‌న్ అలీ ప్రస్తుత ఛాంపియ‌న్స్ ట్రోఫీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

అద్భుతమైన బౌలింగ్‌తో పాక్ జ‌ట్టుకు విజ‌యాలు అందించాడు. ఈ క్రమంలో టోర్నీలో గోల్డెన్ బాల్ కూడా అందుకునే ఛాన్సులున్నాయి. హ‌స‌న్ అలీ ఇప్ప‌టి వ‌ర‌కు టోర్నీలో ప‌ద వికెట్లు తీసుకున్నాడు. ఈ టోర్నీలో అత్య‌ధికంగా వికెట్లుకు తీసుకున్న‌ది హ‌స‌న్ అలీనే కావ‌డం విశేషం. వికెట్లతో పాటు బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయ‌కుండా క‌ట్టుదిట్టంగా కూడా బౌలింగ్ చేశాడు.

మ‌రో పాక్ బౌల‌ర్ జునైద్ ఖాన్ టోర్నీలో ఏడు వికెట్లు తీసుకోవ‌డం మ‌రో విశేషం. ఇక భారత బౌలర్లలో భువ‌నేశ్వ‌ర్ కుమార్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లాండ్ పిచ్‌ల‌పై త‌న స్వింగ్‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను స‌మ‌ర్థంగా క‌ట్ట‌డి చేశాడు. ఈ టోర్నీలో భువ‌నేశ్వ‌ర్ ఆరు వికెట్లు తీసుకున్నాడు.

టీమిండియా విజయాల్లో భువ‌నేశ్వ‌ర్ కీల‌క పాత్ర పోషించాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులిచ్చి ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇదే ఈ టోర్నీలో భువ‌నేశ్వ‌ర్ అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌. ఆదివారం జరిగే ఫైన‌ల్లో భువ‌నేశ్వ‌ర్ త‌న స్వింగ్‌తో పాకిస్థాన్‌ను ఎలా క‌ట్ట‌డి చేస్తాడో చూడాలంటే మరికొన్ని ఆగాల్సిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan paceman Hasan Ali hopes the Champions Trophy final with arch-rivals India will see him continue to live the dream he had before the competition started.
Please Wait while comments are loading...