ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత్ పతనం 45 సెకన్లలో?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్‌గా నిలిచిన భారత్-పాక్ జట్ల మధ్య ఫైనల్ పోరు ఆదివారం ది ఓవల్ వేదికగా ఏకపక్షంగా ముగిసింది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది.

India vs Pakistan Final Highlights, Champions Trophy 2017: Highs and Lows From the Oval

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. అనంతరం 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసి అలౌటైంది. దీంతో భారత్‌పై పాక్ 180 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఫైనల్లో భారత్ వికెట్లు కోల్పోయిన తీరుని ఒకసారి పరిశీలిస్తే:

పాకిస్థాన్ బౌలర్లు మహ్మద్ అమీర్ (3/16), హసన్ అలీ (3/19) ధాటికి భారత టాప్ ఆర్డర్ విలవిలలాడింది. 72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకలోతు కష్టాల్లో పడింది. అయితే చివర్లో హార్దిక్ పాండ్యా (76: 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులు)తో రాణించి టీమిండియా పరువు కాపాడాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan saved their best for the last as they humbled arch-rivals India by a huge margin of 180 runs to win their maiden ICC Champions Trophy title. This also completed Sarfraz Ahmed's team's remarkable comeback, since losing their tournament opener to the same opposition.
Please Wait while comments are loading...