పాక్‌తో ఫైనల్: బుమ్రాకి ధావన్ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ ప్రారంభమైంది. ఓవల్‌ మైదానం వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బుమ్రా, ఓపెనర్ బుమ్రా నుంచి విలువైన సలహాలను తీసుకున్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

బుమ్రాకి ఇదే తొలి ఐసీసీ టోర్నమెంట్ కావడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోని ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

బుమ్రా: 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ ఆడిన అనుభవం ఉంది కదా. ఫైనల్లో ఒత్తిడిని ఎలా అధిగమించాలో చెప్పు?
ధావన్‌: ఫైనల్‌ మ్యాచ్‌లా చూడకుండా.. మరో మ్యాచ్‌లా భావించు. ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. ఫైనల్‌కి ముందు వీలైనంత ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతా. నువ్వు అలాగే ఉండు. గత కొన్ని మ్యాచుల్లో నువ్వు ఒత్తిడిని తట్టుకుని రాణించగలిగావు. ఇదీ అంతే.

India vs Pakistan Final, ICC CT 2017: Shikhar Dhawan has advice for Jasprit Bumrah ahead of crunch game

బుమ్రా: గత ఛాంపియన్స్‌ ట్రోఫీలో బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించావు. టాప్‌ స్కోరర్‌గా నిలిచావు. ఇప్పుడు ఆ దిశగానే దూసుకెళ్తున్నావు. దీని వెనుక ఉన్న సీక్రెట్‌ ఏమిటి?
ధావన్‌: ఆ సీక్రెట్‌ ఏమిటో నాకు తెలియదు. నేను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పు. క్రికెట్‌ ఆడుతూ చాలా ఎంజాయ్‌ చేస్తా. ఇదో పెద్ద టోర్నమెంట్‌. చాలా కష్టతరమైనది. ప్రపంచకప్‌తో సమానం. టాప్‌ జట్లు బరిలో ఉంటాయి. వీలైనంత మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. భవిష్యత్తులోనూ ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణించేందుకు నా వంతు కృషి చేస్తా అని చెప్పాడు.

అంతేకాదు ఈ వీడియోలో బుమ్రాతో ధావన్ మరిన్ని సలహాలను షేర్ చేసుకున్నాడు. అవేంటో మీరు కూడా చూడండి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is all set for the final day of the ICC Champions Trophy when India plays against their arch-rivals Pakistan on Sunday at The Oval. Both teams are filled with young players and as they gear up for a high-voltage final, the key aspect for them would be to deal with pressure in crunch situations of the match.
Please Wait while comments are loading...