భారత్ Vs పాక్: ధావన్ పొగరు, యువీ రాజసం, ఫ్యాన్స్ సందడి (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆదివారం టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో మధ్యాహ్నాం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

2007 వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత మళ్లీ భారత్-పాక్ జట్లు టైటిల్ పోరులో తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్రికెట్ అభిమానులు తమ తమ పనులను ఇప్పటికే చక్కబెట్టుకుని ఆ అద్భుత క్ష‌ణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇరు దేశాల్లో కూడా క్రికెట్ ఫీవర్ వచ్చేసింది.

India vs Pakistan, ICC Champions Trophy 2017 Final: Here is ICC Video

భారత్-పాక్ జట్ల మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ రికార్డులకు ఎక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా 32.4 కోట్ల మంది ఈ మ్యాచ్ వీక్షించనున్నట్టు అంచనా వేస్తున్నారు. క్రికెట్ చరిత్రలో అతి ఎక్కువమంది వీక్షించిన మ్యాచ్‌లలో ఇది మూడోది కాబోతోంది. 2011లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన వరల్డ్ కప్‌ ఫైనల్‌ను 55.8 కోట్ల మంది వీక్షించారు.

అదే టోర్నీలో భారత్-పాక్ మధ్య జరిగిన సెమీస్ పోరును 49.5 కోట్ల మంది చూశారు. ఈ రెండే ఇప్పటి వరకు ఒకటి, రెండు స్థానాల్లో ఉండగా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మూడోది కానుంది. ఈ హైటెన్షన్ మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీ ఐసీసీ ఓ థ్రిల్లింగ్ వీడియోను అభిమానుల కోసం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Fierce rivals India and Pakistan will lock horns in the final of the ICC Champions Trophy 2017 at The Oval on Sunday in what will be a battle between India's remarkable consistency and Pakistan's legendary volatility.
Please Wait while comments are loading...