ఓపెన్ టాప్ బస్సుపై ఫ్యాన్స్ హల్ చల్: ఓవల్‌కు చేరుకున్న ఇరు జట్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆదివారం టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో మధ్యాహ్నాం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో ఇరు జట్లు మ్యాచ్ జ‌రిగే ది ఓవ‌ల్ స్టేడియానికి చేరుకున్నాయి. మరోవైపు మ్యాచ్ మొదలవడానికి మూడు గంట‌ల ముందు నుంచే అభిమానులు కూడా స్టేడియానికి క్యూ క‌ట్టారు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో మైదానానికి తరలివస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆ ప్రాంత‌మంతా ఇండియా, పాక్ అభిమానుల‌తో సంద‌డి సందడిగా మారింది. తమ అభిమాన క్రికెటర్లకు సంబంధించిన ఫోటోలతో పాటు జాతీయ జెండాలను అభిమానులు చేత పట్టుకుని మైదానానికి తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం చోటుచేసుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When India began their ICC Champions Trophy 2017 campaign against Pakistan at Edgbaston today, there were two different schools of thought about the prospects of the two sides.
Please Wait while comments are loading...