వారిదే కీలకపాత్ర: భారత పేసర్లపై కపిల్ ప్రశంసలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రస్తుతం భారత జట్టులో అద్భుతమైన పేసర్లు ఉన్నారని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. అంతేకాదు పేసర్ల వల్లే టీమిండియా వరుసగా తొమ్మిది టెస్టు సిరిస్‌లలో విజయాలు సొంతం చేసుకుందని కపిల్ పేర్కొన్నాడు.

ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శుక్రవారం కపిల్ దేవ్ మాట్లాడాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా లాంటి దిగ్గజ స్పిన్నర్లతో ప్రస్తుత భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉందని అన్నాడు. గత తొమ్మిది టెస్టు సిరిస్ విజయాల్లో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారని కొనియాడాడు.

ఉమేశ్‌ యాదవ్‌పై ప్రశంసలు

ఉమేశ్‌ యాదవ్‌పై ప్రశంసలు

ఇక ఉమేశ్‌ యాదవ్‌ లాంటి బౌలర్‌ తాము ఆడే సమయంలో లేడని, నాణ్యమైన బౌలర్లతో ఉన్న ప్రస్తుత భారత జట్టు మరిన్ని విజయాలు అందుకోవాలని కపిల్ అన్నాడు. ‘ఫాస్ట్‌ బౌలర్లతో ప్రస్తుతం అన్ని జట్లు మ్యాచ్‌లను ప్రారంభిస్తున్నాయి. మా హాయాంలో ఫాస్ట్‌ బౌలర్లు పెద్దగా లేరు. ప్రస్తుతం భారత జట్టులో ఎంతో మంది ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు' అని కపిల్ అన్నాడు.

భారత బౌలర్లపై ప్రశంసలు

భారత బౌలర్లపై ప్రశంసలు

భారత జట్టు ఎక్కడ, ఎప్పుడు మ్యాచ్‌ ఆడినా అభిమానులు పెద్ద సంఖ్యలో మైదానానికి వచ్చి వీక్షిస్తుంటారని కపిల్‌ భారత బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక గత 20 ఏళ్లలో ఏ భారత జట్టు సాధించలేని విజయాలను ప్రస్తుత జట్టు సాధిస్తోంది అని కోచ్‌ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి కపిల్‌ నిరాకరించారు.

రవిశాస్త్రి వ్యాఖ్యలపై నో కామెంట్

రవిశాస్త్రి వ్యాఖ్యలపై నో కామెంట్

‘ఎవరి ఆలోచన విధానం వారికి ఉంటుంది. అది అతని ఆలోచన మాత్రమే. నా విధానం నాకు ఉంటుంది. యువ ఆటగాళ్లు ఎప్పుడైనా మంచి ప్రదర్శనే చేస్తారు. మన ఆటగాళ్లు విజయాలు సాధిస్తే మనమే కదా ఆనందించేది' అని కపిల్ అన్నాడు.

హార్దిక్‌ పాండ్యా ప్రదర్శనపై సంతోషం

హార్దిక్‌ పాండ్యా ప్రదర్శనపై సంతోషం

ఇక ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా ప్రదర్శనపై కపిల్ దేవ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో కూడా అతడు మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నానని కపిల్ పేర్కొన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former captain Kapil Dev says India finally possess a bunch of world class pacers and the team could rely on them besides the spinners. In recent times, India pacers have strongly aided the spin duo of Ravichandran Ashwin and Ravindra Jadeja. They have played a key role in the Test team's undefeated run in the last nine series.
Please Wait while comments are loading...