చాప చుట్టేశారు: భారత్ దెబ్బకు 135కే కుప్పకూలిన లంక.. ఫాలో ఆన్ షురూ!

Subscribe to Oneindia Telugu

పల్లెకెలె: భారత బౌలర్లు మరోసారి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. శ్రీలంకతో ఆఖరి టెస్టు తొలి ఇన్సింగ్స్ లో 135 ప‌రుగుల‌కే ప్రత్యర్థిని కట్టడి చేశారు. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 352 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది.

లంక్ బ్యాట్స్ మెన్ ను ఏమాత్రం క్రీజులో కుదురుకోనివ్వని భారత స్పిన్నర్లు వరుసగా వికెట్లు తీస్తూ వచ్చారు. కుల్‌దీప్ యాద‌వ్ 4, అశ్విన్, ష‌మి చెరో రెండు వికెట్లు తీయ‌గా.. పాండ్యా ఒక వికెట్ తీసి లంకను చిత్తు చేశారు. మ‌రొక‌రు ర‌నౌట‌య్యారు.

లంక బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ చండీమాల్ మాత్ర‌మే 48 ప‌రుగుల‌తో చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. కేవ‌లం 37.4 ఓవ‌ర్ల‌లోనే లంక తొలి ఇన్నింగ్స్ ముగియగా.. వరుసగా రెండో టెస్టులోను ఆ టీమ్ ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కలేకపోవడం గమనార్హం.

లంచ్ తర్వాత ఆలౌట్.. భారత్ తొలి ఇన్నింగ్స్ 487

శ్రీలంకతో టెస్టులో రెండో రోజు ఆటలో భాగంగా.. లంచ్ విరామం తర్వాత భారత్ చాప చుట్టేసింది. విరామం ముందు వరకు ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన పాండ్యా.. విరామం తర్వాత కేవలం మూడు బాల్స్‌ను మాత్రమే ఎదుర్కొని పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఆలౌట్ అయింది. ఉమేష్ యాదవ్(3) నాటౌట్‌గా నిలిచాడు.

విరామం తర్వాత పరుగులేమి చేయకపోవడంతో.. అంతకుముందు స్కోరు 487పరుగుల వద్దే భారత్ ఆలౌట్ అయింది. అటు భారత్ ఆలౌట్ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్ తరంగ మహమ్మద్ షమి(5) బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మెండిస్, దిముత్ కరుణరత్నే(4) ఉన్నారు.

Shami

లంచ్ విరామానికి ముందు:

India Vs Sri Lanka : Shikhar Dhawan Miss Double Century

శ్రీలంకతో ఆఖరి టెస్టులోను భారత్ దుమ్ము రేపుతోంది. తొలిరోజు మిడిలార్డర్ తడబడినా.. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా రెండో రోజు ఆ నష్టాన్ని పూడ్చేలా చెలరేగాడు. ఏకంగా 86బంతుల్లోనే తన తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు.

పాండ్యా సెంచరీ ఇన్సింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు నమోదు కావడం విశేషం. పాండ్యా సెంచరీ(108)తో భోజన విరామానికి భారత్ స్కోరు 487/9కు చేరుకోగా.. అతనితో పాటు ఉమేష్ యాదవ్(3) ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు.

India vs Sri Lanka, 3rd Test, Day 2, Pallekele: Hardik Pandya gets maiden Test 100

కాగా, అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 329/6తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 43పరుగుల వద్ద ఫెర్నాండో బౌలింగ్‌లో వృద్దిమాన్ సాహా(16) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.

ధావన్ సరికొత్త రికార్డు: సెంచరీ తర్వాత వినూత్న సంబరం

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 26పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సందకన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ వెంటనే మహమ్మద్ షమీ కూడా సందకన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాక.. ఉమేష్ క్రీజులోకి వచ్చాడు. పాండ్యా రాణించడంతో భారత్ పటిష్ట స్థితికి చేరుకున్నట్లే కనిపిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian cricket team will look to get a big first innings target against Sri Lanka on Day 2 of the third and final Test at the Pallekele International Cricket Stadium. Hardik Pandya scored his maiden Test century to take India to a commanding total.
Please Wait while comments are loading...