నా భార్య ఆ టెస్టు చూడలేదు: స్లెడ్జింగ్‌‌పై పుజారా కీలక వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అంతర్జాతీయ టెస్టుల్లో ప్రత్యర్ధుల్ని టీమిండియా బ్యాట్స్‌మెన్ పుజారా కవ్వించిన ఉదంతాలు లేవనే చెప్పాలి. అలాంటి పుజారా అవసరమైతే ఫీల్డింగ్‌ చేసేటప్పుడు స్లెడ్జింగ్‌కు వెనుకాడబోనని చెప్పాడు. బీసీసీఐ టీవీ కోసం రహానే తనను చేసిన ఇంటర్వ్యూలో పుజారా ఈ వ్యాఖ్యలు చేశాడు.

'నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా ఫుట్‌బాల్‌ ఆడేటప్పుడు చాలా అరుస్తాను. ఫీల్డింగ్‌ చేస్తున్నపుడు ఎలా అరుస్తున్నానో నువ్వు చూసే ఉంటావు. ఒక బ్యాట్స్‌మన్‌ను స్లెడ్జ్‌ చేయాలనుకుంటే చేసి తీరాల్సిందే. అది మన బౌలర్లకు ఉపయోగపడుతుందనుకుంటే' అని రహానేతో ఇంటర్యూలో పుజారా చెప్పాడు.

సెంచరీలతో ఎప్పుడూ సంతృప్తి చెందబోను

అంతేకాదు సెంచరీలతో తాను ఎప్పుడూ సంతృప్తి చెందబోనని, వాటిని భారీ ఇన్నింగ్స్‌గా మలచాలని భావిస్తానని పుజారా తెలిపాడు. 'నా తొలి అండర్‌-14 మ్యాచ్‌లో 300 పరుగులు సాధించడం నాకు ఇప్పటికీ గుర్తుంది. టెస్టుల్లో విజయం సాధించాలంటే సెంచరీ సరిపోదు. భారీగా పరుగులు చేయాలని నేనెప్పుడూ భావిస్తాను' అని పూజారా అన్నాడు.

నా భార్యతో చాలా మాట్లాడతాను

నా భార్యతో చాలా మాట్లాడతాను

ఇక రహానే తాను ఇతరులతో అంత కలివిడిగా ఉండననే అభిప్రాయం తప్పని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. 'నేను కలివిడిగా ఉండనని చాలామంది అనుకుంటారు. కానీ నేను అందరితో ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడతాను. నిజంగా చెప్పాలంటే నా భార్యతో చాలా మాట్లాడతాను. చిన్నప్పటి నుంచి కామ్‌గా ఉండేవాడిని. నా కుటుంబ నేపథ్యం ఇందుకు కారణం కావచ్చు. ప్రశాంతంగా ఉండడం మ్యాచ్‌ల్లో ఎంతో ఉపయోగపడుతోంది' అని రహానే చెప్పాడు.

పుజారాకి 50వ టెస్టు మ్యాచ్‌

కొలంబో టెస్టులో పుజారా సెంచరీని తన భార్య చూడలేదన్న స్వయంగా పుజారానే తెలిపాడు. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య కొలంబోలో రెండో టెస్టు ఆదివారం ముగిసింది. ఈ టెస్టు భారత క్రికెటర్‌ పుజారాకి 50వ టెస్టు మ్యాచ్‌. అంతేకాదు ఈ మ్యాచ్‌లో పుజారా 133 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌ని పుజారా భార్య పూజా స్వయంగా చూడకపోవడం విశేషం.

50వ టెస్టు ఎంతో ప్రత్యేకమైనది

ట్విటర్‌ ద్వారా పుజారా తన భార్యతో కలిసి దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. '50వ టెస్టు ఎంతో ప్రత్యేకమైనది. ఈ టెస్టులో శతకం సాధించిన సందర్భంగా నన్ను అభినందించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ఫొటోలో ఉన్న నా భార్య నా 50వ టెస్టును ప్రత్యక్షంగా వీక్షించలేకపోయింది' అని పేర్కొన్నాడు.

లంకలో పర్యటనలో ఆటగాళ్ల భార్య, పిల్లలు

లంకలో పర్యటనలో ఆటగాళ్ల భార్య, పిల్లలు

మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో అశ్విన్‌, రహానేతో పాటు పలువురు ఆటగాళ్లు భార్య, పిల్లలతో కలిసి శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ఈ సిరిస్‌లో ఆటగాళ్లు అరుదైన ఘనతలను సాధిస్తున్న సమయంలో పక్కనే వారి కుటుంబసభ్యులు ఉంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: English
English summary
Cheteshwar Pujara has always been known as a calm and soft-spoken cricketer both on and off the field, but the Rajkot-based cricketer is trying to break the mould by learning the art of sledging.
Please Wait while comments are loading...