పాక్‌కు బొమ్మ చూపించారు: 5వికెట్ల తేడాతో భారత్ విజయం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు దూసుకుపోతుంది. టోర్నీలో భాగంగా బ్యాంకాక్‌లో మంగళవారం పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజా విజయంతో టోర్నీలో భారత మహిళల జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది.

తొలుత టాస్ గెలిచిన భారత మహిళల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత ఓవర్లలో పాకిస్థాన్ మహిళల జట్టు 7 వికెట్లను కోల్పోయి 97 పరుగులు చేసింది. అబిది(37 నాటౌట్) పాకిస్తాన్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లు ఏక్తా బిస్త్‌ మూడు, అనూజ పాటిల్‌, హమ్రన్‌ప్రీత్‌ కౌర్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

India women beat Pakistan by five wickets in Asia Cup

అనంతరం 98 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు మిథాలీ రాజ్(36), మందనా(14)లు భారత్‌కు చక్కని శుభారంభానిచ్చారు. దీంతో 12 ఓవర్లు ముగిసి సరికి భారత్ రెండు వికెట్లను కోల్పోయి 51 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (26 నాటౌట్) పరుగులతో రాణించగా అయేషా జాఫర్(28) ఆకట్టుకుంది. టోర్నీలో అంతక ముందు థాయ్ లాండ్, బంగ్లాదేశ్‌లపై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India’s stranglehold over Pakistan in big tournaments shows no sign of abating as the women’s team beat their arch-rivals by five wickets in a thrilling round robin league match of the Twenty20 Asia Cup in Bangkok on Tuesday.
Please Wait while comments are loading...