టీమిండియాకు అరుదైన ఆహ్వానం: భారత హైకమిషన్‌లో సందడి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో లీగ్ దశను విజయవంతంగా పూర్తి చేసుకుని సెమీస్‌కు చేరిన భారత జట్టు ఆటగాళ్లు లండన్‌లో షికార్లు చేస్తున్నారు. జూన్ 15వ తేదన ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగే సెమీ పైనల్ మ్యాచ్‌లో టీమిండియా, బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

 Indian High Commission in London hosts reception for Team India

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు  | స్కోరు కార్డు

అయితే ఈ మ్యాచ్‌కి కాస్తంత విరామం లభించడంతో టీమిండియా ఆటగాళ్లకు అరుదైన ఆహ్వానం లభించింది. లండన్‌లో ఉన్న భారత్‌ హైకమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించాల్సిందిగా కోరడంతో టీమిండియా ఆటగాళ్లు, కోచ్‌ అనిల్‌ కుంబ్లేతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ సోమవారం అక్కడికి వెళ్లారు.

 Indian High Commission in London hosts reception for Team India

ఈ కార్యక్రమానికి టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లేతోపాటు టీమిండియా క్రికెటర్లు మహేంద్రసింగ్ ధోనీ, విరాట్‌కోహ్లీ, పాండ్యా, శిఖర్‌ధవన్‌, రవీంద్ర జడేజా, ఇతర క్రికెటర్లు, బీసీసీఐ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా భారత్‌ హైకమిషన్‌ కార్యాలయ సిబ్బంది టీమిండియాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. బంగ్లాదేశ్‌తో జరగనున్న సెమీ పైనల్ మ్యాచ్‌‌లో టీమిండియా విజయం సాధించి పైనల్‌కు చేరుకోవాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian High Commission in London, U.K. hosted a reception for the Indian Cricket Team, who is in the country for the ongoing ICC Champions Trophy tournament, on Monday evening.
Please Wait while comments are loading...